రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి: అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2022-11-25T01:01:39+05:30 IST

ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని ప్రజలు రక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్ధితిలు నెలకొన్నాయని సీనియర్‌ దళిత నేత, జై అంబేడ్కర్‌ భేరి ఉద్యమ నేత కేబీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి: అంబేడ్కర్‌

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 24 : ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని ప్రజలు రక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్ధితిలు నెలకొన్నాయని సీనియర్‌ దళిత నేత, జై అంబేడ్కర్‌ భేరి ఉద్యమ నేత కేబీఆర్‌ అంబేడ్కర్‌ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. కడియం మండలం మురమండకు చెందిన అంబేడ్కరిస్టు ముంగమూరి చినబాబు రూపొందించిన రాజ్యాంగ పీఠిక క్యాలెండర్‌ 2023 ను ఆవిష్కరించారు. మత గ్రంథాల కన్నా రాజ్యాంగం గొప్పదన్నారు.సమావేశంలో బీఎస్పీ కన్వీనర్‌, న్యాయవాది ఇసకపట్ల రాం బాబు ,నక్కా వెంకటరత్నం, ,రూరల్‌ నాయకుడు పల్లి అబ్బులు, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి సుబ్బన మోహన్‌, గొల్లపల్లి సత్యనారాయణ, సాకా సతీష్‌, దమ్ము కృష్ణ, డి.వందన, ఎండీ షరీఫ్‌, టి.రవళి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T01:01:39+05:30 IST

Read more