సత్యదేవుడి భక్తులకుఅరిటాకులలో అన్నప్రసాదం పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-12-10T00:40:28+05:30 IST

అన్నవరం దేవస్థానం నిత్యాన్నదాన పఽథకంలో భక్తులకు అందించే అన్నప్రసాదాన్ని శుక్రవారం తిరిగి అరిటాకులలో వడ్డన ప్రక్రియను పునరుద్ధరించారు.

సత్యదేవుడి భక్తులకుఅరిటాకులలో అన్నప్రసాదం పునరుద్ధరణ

రూ.2లక్షలతో కొన్న స్టీల్‌ కంచాలను ఒక్కరోజులోనే పక్కన పెట్టారు

అన్నవరం, డిసెంబరు 9: అన్నవరం దేవస్థానం నిత్యాన్నదాన పఽథకంలో భక్తులకు అందించే అన్నప్రసాదాన్ని శుక్రవారం తిరిగి అరిటాకులలో వడ్డన ప్రక్రియను పునరుద్ధరించారు. భక్తులకు కంచాలలో వడ్డింపును గురువారం ప్రారంభించగా ఈ నిర్ణయం సరికాదంటూ పూర్వపు పద్ధతి అయిన అరిటాకులలో అందించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటుగా ప్రకటన విడుదల చేశారు. దీంతో అధికారులు నిర్ణయం మార్చుకున్నారు. ఇదిలావుండగా సుమారు రూ.2లక్ష లతో వ్రతపురోహిత సంఘం అందించిన స్టీల్‌కంచాలను ఒక్కరోజులోనే పక్కన పెట్టేయాల్సి వచ్చింది. త్వరలో బఫే విధానం అదనంగా అమలుచేయనున్న దృష్ట్యా వీటిని ఆ సమయంలో వినియోగించనున్నారు. అరిటాకులలో అందించడంతో పాటు బఫేను కొనసాగిస్తామని అధికసమయం వేచిఉండలేని భక్తులు దీనిని వినియోగించుకోవచ్చునని, భక్తులు ఏది కావాలి అనుకుంటే వాటిలో అందించనున్నట్టు అధికారులు తెలిపారు. బఫే ఏర్పాటుకు హాలును సిద్ధం చేస్తున్నామని, దేవదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-12-10T00:40:30+05:30 IST