-
-
Home » Andhra Pradesh » East Godavari » sanukula-NGTS-AndhraPradesh
-
సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించాలి
ABN , First Publish Date - 2022-09-11T06:55:00+05:30 IST
సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించుకోవాలని అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి పేర్కొ న్నారు.

ఆత్మహత్యల నివారణ దినోత్సవ సదస్సులో అడిషనల్ ఎస్పీ లతామాధురి
అమలాపురం టౌన్, సెప్టెంబరు 10 : సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరూ సానుకూల దృక్ఫథాన్ని పెంపొందించుకోవాలని అడిషనల్ ఎస్పీ కె.లతామాధురి పేర్కొ న్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ సైకియాట్రి సొసైటీ రాష్ట్రశాఖ, కిమ్స్ సహకారంతో శనివారం వైద్య విద్యార్థులతో సదస్సు నిర్వహించారు. ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన సదస్సులో అడిషనల్ ఎస్పీ లతా మాధురితోపాటు డీఎస్పీ వై.మాధవరెడ్డి, కిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనంద్‌ఆచార్య, సైకియాట్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ అబ్దుల్‌సలాం, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజ్‌కిరణ్, నర్సింగ్ ప్రిన్సిపాల్ స్వప్నలు మాట్లాడారు. అనంతరం కళాశాల గ్రంథాలయ భవనం వద్ద నుంచి ఎర్రవంతెన వద్ద వరకు నిర్వహించిన ర్యాలీని లతామాధురి ప్రారంభించారు. వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులతోపాటు పట్టణ సీఐ కొండలరావు, తాలూకా సీఐ పి.వీరబాబు, ఎస్‌ఐలు అందే పరదేశి, జి.వెంకటేశ్వరరావు, డాక్టర్ పీఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఆత్మహత్యల నివారణా దినోత్సవం ర్యాలీని డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మశ్రీరాణి జెండా ఊపి ప్రారంభించారు. సైకియాట్రిస్టు డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, డాక్టర్ సుప్రియ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.