-
-
Home » Andhra Pradesh » East Godavari » samarlakota mandlam dap rates high-NGTS-AndhraPradesh
-
డీఏపీ ధరలకు రెక్కలు!
ABN , First Publish Date - 2022-09-19T05:48:17+05:30 IST
సామర్లకోట, సెప్టెంబరు 18: మండలంలోని పలు ప్రాంతాల్లో డీఏపీ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యవ సాయశాఖ నిర్దేశించిన మేరకు డీఏపీ బస్తా రూ.1,350 చొప్పున విక్రయించాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.1550 చొప్పున విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతగా పెంపు, డీఏపీ ఎరువుల ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులు డీఏపీ, యూరియా క

సామర్లకోట, సెప్టెంబరు 18: మండలంలోని పలు ప్రాంతాల్లో డీఏపీ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యవ సాయశాఖ నిర్దేశించిన మేరకు డీఏపీ బస్తా రూ.1,350 చొప్పున విక్రయించాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.1550 చొప్పున విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతగా పెంపు, డీఏపీ ఎరువుల ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులు డీఏపీ, యూరియా కలిపి వినియోగించడం ప్రారంభి ంచా రు. దీంతో డీఏపీకి మార్కెట్లో డిమాండ్ వచ్చింది. ఇదే అదనుగా వ్యాపారులు డీఏపీ ధరలు పెంచేశారు. మండలంలోని పలు గ్రామాల్లో డీలర్లు డీఏపీ బస్తా ధర రూ.1,500 నుంచి రూ.1,550 చొప్పున విక్రయిస్తున్నట్టు రైతు సంఘాలు చేసిన ఫిర్యాదులు సైతం జిల్లా వ్యవసాయాధికారులకు అందినా అధికారులు ఎవరూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో సమృద్ధిగా డీఏపీ ఎరువులు లేకపోవడమే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేకపోయారన్న ఆరోపణలు కూడా వినిపస్తున్నాయి. కొందరు వ్యాపారులు డీఏపీ కావాలంటే కాంప్లెక్స్ ఎరువులు లింక్ కలిపి అమ్ముతున్నారని రైతు లు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను అందుబాటులో ఉంచకపోవడం, గతంలో విక్రయించే సోసైటీలకు ఎరువుల విక్రయాలు నిలుపుదల అంశాలతో రైతులు ఖరీఫ్ సీజన్లో పంట కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.