జీతాలు పెంచాలంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

ABN , First Publish Date - 2022-02-19T05:45:01+05:30 IST

ఉపాధి హామీ పథకంలో 16 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎంపీడీవో ఎన్వీవీఎస్‌ మూర్తికి మొరపెట్టుకున్నారు.

జీతాలు పెంచాలంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్ల వినతి

రాజానగరం, ఫిబ్రవరి 18: ఉపాధి హామీ పథకంలో 16 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఎంపీడీవో ఎన్వీవీఎస్‌ మూర్తికి మొరపెట్టుకున్నారు. మండలంలోని ఫీల్డ్‌ అసిస్టెంట్లంతా బుధవారం ఎంపీడీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 2006 నుంచి ఉపాధి హామీ పథకంలో చేస్తూ అధికారులిచ్చిన లక్ష్యాలను అధిగమిస్తూ విధులు నిర్వహిస్తున్నప్పటికి ప్రభుత్వం తమ పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు. కరోనా సమయంలో 60శాతం, 40శాతం రేషియోలో రాష్ట్రానికి అధిక నిధుల విడుదలలో తమ పాత్ర ప్రధానమైందన్నారు. 2019లో అన్ని విభాగాల వారికి 30శాతం జీతాలు పెంచి, తమకు మాత్రం మొండి చేయి చూపించారన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లను రెగ్యులర్‌ చేయాలని, మండల స్థాయి బదిలీల సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ.25 వేలు చెల్లించాలని, అర్హులకు ఎఫ్‌టీఈ పూర్తిస్థాయి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అలాగే కరోనా కారణంగా 7500 పనిదినాలు చేరుకోని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకుని జీతాలు చెల్లించాలని, కరోనా, ఇతర కారణాలతో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి కారుణ్య నియామకం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-02-19T05:45:01+05:30 IST