రూ.3.43 లక్షల విలువైన నిషేధిత పొగాకు పట్టివేత

ABN , First Publish Date - 2022-09-24T06:52:55+05:30 IST

మండలంలో గండేపల్లి జాతీయరహదారిపై గురువారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం నుంచి జగ్గంపేట వైపు వెళుతున్న లారీలో గుట్కా, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చే శారు.

రూ.3.43 లక్షల విలువైన నిషేధిత పొగాకు పట్టివేత

గండేపల్లి, సెప్టెంబరు 23: మండలంలో గండేపల్లి జాతీయరహదారిపై గురువారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం నుంచి జగ్గంపేట వైపు వెళుతున్న లారీలో గుట్కా, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చే శారు. శుక్రవారం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. దీనికి సం బంధించి ఎస్‌ఐ గణే్‌షకుమార్‌ తెలిపిన వివరాల  ప్రకారం పెద్దాపురం డీఎస్పీ మురళీమోహన్‌, ఎస్‌బీ డీఎస్పీ అంబికా  ప్రసాద్‌, సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణలో వారికి వచ్చిన ముందస్తు సమాచారం ప్రకారం  జాతీయ రహదారిపై వా హనాలు తనిఖీ నిర్వహిస్తూ గండేపల్లి గ్రామ శివారులో ఈ లారీని పట్టుకున్నామన్నారు. ఈలారీలో  సుమారు 3.43లక్షల గుట్కా పౌచ్‌లను, 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాగేంద్ర చంద్రప్ప, లాలప్పలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. లారీ యజమాని సురేష్‌ కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రాకు నిషేధిత పొగాకు తరలిస్తుంటాడని పోలీసులకు వ చ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామన్నారు. దీని విలువ రూ. 30,43,800ఉంటుందని పోలీసులు తెలిపారు. లారీని పట్టుకున్న ఎస్‌ఐ గణే్‌షకుమార్‌ను, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

మోతుగూడెం: అల్లూరి  సీతారామరాజుజిల్లా వై. రామ వరం మండలం బొడ్డగండి పంచాయతీ నుంచి శుక్రవారం అక్రమంగా  తరలిస్తున్న 29 మద్యం సీసాలను డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణా రాష్టం ఇందిరమ్మకా లనీ సూర్యాపేటకు చెందిన  కేశవార్పు మహేష్‌, రేగు వేణు గోపాల్‌, మట్టపల్లి సాయికుమార్‌ బొత్త అభినాష్‌లు ఇంట ర్మీడియట్‌ చదువుతున్నారు. వీరు డొంకరాయి బస్సు సెంటర్‌ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుంటే డొంకరాయి ఎస్‌ఐ ఈ నరసింహమూర్తికి సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి వెళ్లి వారి బ్యాగులు తనిఖీ చేయగా తెలంగాణా మద్యం 29బాటిల్స్‌ దొరికాయి. ఈ మద్యంసీసాలు తీసుకుని లంబసింగి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని రంపచోడవరం కోర్టుకి హాజరుపరు స్తామని డొంకరాయి ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ వెంట హెడ్‌ కానిస్టే బుల్‌ నారాయణ, పోలీస్‌లు నరేష్‌, శ్రీను, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.


Read more