అధ్వాన రహదారి దుస్థితిపై బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2022-11-25T01:05:05+05:30 IST

భారీ గోతులతో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన ఏలేశ్వరం-నర్సీపట్నం ఏజెన్సీ ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితిని నిరశిస్తూ గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

అధ్వాన రహదారి దుస్థితిపై బీజేపీ ఆందోళన

ఏలేశ్వరం, నవంబరు 24:భారీ గోతులతో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన ఏలేశ్వరం-నర్సీపట్నం ఏజెన్సీ ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితిని నిరశిస్తూ గురువారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆపార్టీ మండలాధ్యక్షుడు ఏనుగు ధర్మరాజు, మండల ఇన్‌చార్జి సింగిలిదేవి సత్తిరాజు, జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావుల నాయకత్వంలో పలువురు గ్రామస్థులు, కార్యకర్తలతో కలసి రమణయ్యపేట గ్రామం నుంచి జె.అన్నవరంవరకు రోడ్డును అభివృద్ధి చేయడంలో అధికారులు అనుసరిస్తున్న తీరును నిరశిస్తూ ప్రదర్శన, ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఏజెన్సీకు ముఖద్వారమైన ఏలేశ్వరం నుంచి అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, నర్సీపట్నం తదితర గిరిజన మండలాలకు వెళ్లే ఈ ప్రధాన రహదారి 15 కిలోమీటర్ల మేర పెద్దపెద్ద గోతులు ఏర్పడి అధ్వానంగా మారిందన్నారు. కార్యక్రమంలో దాకే కృష్ణారావు, కూరాకుల రాజా, గుల్లంపూడి కొండలరావు, కోటనూకరాజు, పతివాడ వెంకటేశ్వరావు, రెడ్డి లోవరాజు, నాయకులు పాల్గొన్నారు.

కలగకుండా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ కృషిమేరకు చర్యలు తీ

Updated Date - 2022-11-25T01:05:07+05:30 IST