-
-
Home » Andhra Pradesh » East Godavari » roads importance-NGTS-AndhraPradesh
-
రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-07-18T07:03:55+05:30 IST
ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోం దని ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సూర్యా రావుపాలెం నుంచి పసలపూడి వరకు నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆయన ప్రారంభించారు.

ఉండ్రాజవరం, జూలై 17: ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని సూర్యా రావుపాలెం నుంచి పసలపూడి వరకు నిర్మించిన ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజవర్గంలో సుమారు రూ.80 కోట్లతో రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లో రూ.20 కోట్లతో పంచా యతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే కాల్థరి గ్రామంలో నిర్మించిన పంచాయతీరాజ్ రోడ్డును ప్రారంభించారు. సూర్యారావుపాలెంలో పి.శ్రీని వాస్‌కు వైద్యఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.50 చెక్కును, కాల్థరి గ్రామంలో పి.వెంకటేశ్వరరావు, జి.శ్రీదుర్గారాణి, టి.నాగమ్మ, కె.దేవి, ఎం.అరుణ, ఎ.ధనరాజులకు రూ.1.93 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నం దిగం భాస్కరరామయ్య, ఎంపీపీ పాలాటి యల్లారీశ్వరి తదితరులు పాల్గొన్నారు.