వ్యాన్‌ ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-08-16T07:23:40+05:30 IST

తాళ్లరేవు, ఆగస్టు 15: పోలేకుర్రు పంచాయతీ పరిధి 216 జాతీయ రహదారి వైజంక్షన్‌ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైనట్టు కోరింగ ఎస్‌ఐ టి.శివకుమార్‌ తెలిపారు. కాకినాడ అన్నంగాటీ సెంటరుకు చెంది

వ్యాన్‌ ఢీకొని యువకుడి మృతి

తాళ్లరేవు, ఆగస్టు 15: పోలేకుర్రు పంచాయతీ పరిధి 216 జాతీయ రహదారి వైజంక్షన్‌ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్ర గాయాలపాలైనట్టు కోరింగ ఎస్‌ఐ టి.శివకుమార్‌ తెలిపారు. కాకినాడ అన్నంగాటీ సెంటరుకు చెందిన మాల్లాడి సంతోష్‌ (19), అహ్మాద్‌ (23) యానాం నుంచి బైక్‌పై వస్తుండగా కాకినాడ నుంచి యానాం వెళ్తున్న బోలేరో వ్యాన్‌ ఢీకొంది. దీంతో అహ్మద్‌ అక్కడిక్కడే మృతిచెందగా సంతో్‌షకు తీవ్ర గాయాలుకావడంతో అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 

Read more