రక్తమోడిన రహదారి

ABN , First Publish Date - 2022-11-28T01:28:08+05:30 IST

చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై అనకాపల్లిజిల్లా ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమా దంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు కాకినాడ జిల్లాకు చెందినవారు కాగా మరొకరు అనకాపల్లి జిల్లా వాసి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు..

రక్తమోడిన రహదారి

కారు ఢీకొని ముగ్గురు వ్యక్తుల దుర్మరణం

ఇద్దరిది కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం

బంధువుల ఇంటిలో ఫంక్షన్‌కు హాజరై తిరిగి వెళుతుండగా ప్రమాదం

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువుల డిమాండ్‌

రహదారిపై బైఠాయింపు... చర్చలు జరుపుతున్న పోలీసులు

ఎలమంచిలి (అనకాపల్లిజిల్లా)/ కిర్లంపూడి, నవంబరు 27: చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై అనకాపల్లిజిల్లా ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమా దంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఇద్దరు కాకినాడ జిల్లాకు చెందినవారు కాగా మరొకరు అనకాపల్లి జిల్లా వాసి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలు..

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన భీశెట్టి కుమారి(38) సోదరి అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో ఉంటున్నారు. ఆదివారం ఆమె కుమార్తె ఫంక్షన్‌ వుండడంతో భీశెట్టి కుమారితోపాటు ఆమె వియ్యంకుడు మొల్లేటి శివాజీ(45), మరికొందరు పిసినికాడ వచ్చారు. ఫంక్షన్‌ ముగిసిన తరువాత సాయంత్రం రెండు ద్విచక్రవాహ నాలపై కిర్లంపూడి బయలుదేరారు. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఒక్కో వాహనంపై ముగ్గురు ఉండడంతో పోలీసులు కేసులు రాస్తారన్న భయంతో వాహనాలు దిగి రోడ్డు పక్కన నడుచు కుంటూ వెళుతున్నారు. ఇదే సమయంలో ఎలమంచిలి మండలం పద్మనాభరాజుపేటకు చెందిన యడ్ల గోవిందు(50) ద్విచక్రవాహనంపై ఎలమంచిలి వచ్చి తిరిగి ఇంటికి వెళుతున్నారు. పోతిరెడ్డిపాలెం జంక్షన్‌ సమీపంలో ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొన్నది. అనంతరం కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నడుచు కుంటూ వెళుతున్న మొల్లేటి శివాజీ, భీశెట్టి కుమారిల మీదుగా దూసుకు పోయింది. దీంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసు కున్న పద్మనాభరాజుపేట గ్రామ స్థులతో పాటు పిసినికాడ నుంచి కుమారి బంధువులు కూడా వచ్చి ఆందోళ నకు దిగారు. మృతుల కుటుంబా లకు న్యాయం చేయాలని డిమాం డ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న అనకాపల్లి డీఎస్పీ శ్రీనివాస్‌, ఎలమంచిలి సీఐ గఫూర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మా ట్లాడారు. వాహనాల రాకపోక లకు ఇబ్బంది కలిగించవద్దని కోర డంతో ఆందోళనకారులు రోడ్డుపై నుంచి పక్కకు వచ్చారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసే వరకు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలిం చవద్దని వారు స్పష్టం చేశారు. చట్ట ప్రకారం న్యాయంచేస్తామని డీఎస్పీ హామీతో ఆందోళన విరమించారు. దీంతో మృతదేహాలను యలమంచిలి ప్రభుత్వాసుత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా మృతుడు యడ్ల గోవిందుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను నక్కపల్లి మండలంలోని హెటెరో ఔషధ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దీంతో జగపతినగరం గ్రామంలో బంధువుల ఇంటివద్ద విషాదచాయలు అలుముకున్నాయి. వియ్యంకుడు, వియ్యపురాలు ఈ వేడుకకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని బోరున విలపిస్తున్నారు. మృతుడు శివాజీకి ఒక పాప, బాబు, కుమారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

Updated Date - 2022-11-28T01:28:11+05:30 IST