రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2022-09-10T06:24:52+05:30 IST

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మండలంలోని జి.రాగంపేట గ్రామ శివారులో ఓ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్లమూరు గ్రామానికి చెందిన ఎం.ఆదినారాయణ (70) తన విధులను నిర్వర్తించేందుకు వడ్లమూరు నుంచి జి.రాగంపేట గ్రామానికి సైకిల్‌పై వస్తున్నాడు.

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి

పెద్దాపురం, సెప్టెంబరు 9: గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మండలంలోని జి.రాగంపేట గ్రామ శివారులో ఓ పంచాయతీ కార్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వడ్లమూరు గ్రామానికి చెందిన ఎం.ఆదినారాయణ (70) తన విధులను నిర్వర్తించేందుకు వడ్లమూరు నుంచి జి.రాగంపేట గ్రామానికి సైకిల్‌పై వస్తున్నాడు. ఇంతలో వెనకవైపు నుంచి గుర్తుతెలియని వాహనం ఆదినారాయణను బలంగా ఢీకొనడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదినారాయణ జ.రాగంపేట పంచాయతీలో కాంట్రాక్టు విధానంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ఇద్దరు కుమారులున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి ఎస్‌ఐ మురళీమోహన్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Read more