దళితుల సమస్యలపై అలుపెరుగని పోరాటం

ABN , First Publish Date - 2022-09-17T06:50:39+05:30 IST

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దళితుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బొజ్జ తారకమని కుల నిర్మూలన పోరాట సమితి(కేఎన్‌పీఎస్‌) రాష్ట్రాధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ అన్నారు.

దళితుల సమస్యలపై అలుపెరుగని పోరాటం

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 16: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దళితుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు బొజ్జ తారకమని కుల నిర్మూలన పోరాట సమితి(కేఎన్‌పీఎస్‌) రాష్ట్రాధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్‌ అన్నారు. స్థానిక గోకవరం బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ భవనంలో శుక్రవారం కేఎన్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోణాల లాజర్‌ అధ్యక్షతన బొజ్జ తారకం 7వ వర్ధంతి సభ జరిగింది. దీనికి ప్రభాకర్‌తోపాటు పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెడంగి చిట్టిబాబు, హైకోర్టు అడ్వకెట్‌ భీమారావు, బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బి.జార్జిఅంటోని, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, అరుణోదయ కళాకారుడు భీమశంకరం, సానబోయిన రామారావు, ఎం.జాన్‌బాబు, గెడ్డం రవీంద్రబాబు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు వైరాల అప్పారావు, ఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకుడు కోరుకొండ చిరంజీవి పాల్గొన్నారు. బొజ్జ తారకం లేని లోటు తీర్చలేనిదని, 1939లో కోనసీమ జిల్లాలో పుట్టిన ఆయన మరణించే వరకు దళితుల కోసం ఉద్యమించారని వారు అన్నారు.  తొలుత వారు బొజ్జ తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Read more