రెడ్‌క్రాస్‌ సొసైటీతో సేవలు

ABN , First Publish Date - 2022-11-08T01:11:33+05:30 IST

రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు.

రెడ్‌క్రాస్‌ సొసైటీతో సేవలు

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 7: రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని సంహిత కన్వెన్షన్‌ హాలులో జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ మేనేజ్‌మెంట్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే నెలరోజుల వ్యవధిలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న భవిష్యత్‌ కార్యాచరణపై సభ్యులతో చర్చించారు. నవంబరు 12న న్యూమెనియా డే, 14న చిల్డ్రన్స్‌ డే, 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పలు వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో కొత్తగా ఉమెన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ బ్రాంచి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా కార్యదర్శి జక్కంపూడి విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు నరేష్‌ రాజు, దాల్‌ సింగ్‌, లంక సత్యనారాయణ, కేవీ రమణ, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-08T01:11:33+05:30 IST

Read more