10న రాజమహేంద్రవరంలో శ్రీరామనవమి శోభాయాత్ర

ABN , First Publish Date - 2022-04-05T06:21:04+05:30 IST

శ్రీరామచంద్రుని జన్మదినమైన శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 10వ తేదీన రాజమహేంద్రవరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు కొండేపూడి సురేష్‌, బండ్ల శంకర్‌, శ్రీరామ్‌ వెల్లడించారు.

10న రాజమహేంద్రవరంలో శ్రీరామనవమి శోభాయాత్ర

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 4: శ్రీరామచంద్రుని జన్మదినమైన శ్రీరామ నవమి సందర్భంగా ఈనెల 10వ తేదీన రాజమహేంద్రవరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టు శ్రీరామ ఉత్సవ సమితి ప్రతినిధులు కొండేపూడి సురేష్‌, బండ్ల శంకర్‌, శ్రీరామ్‌ వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తేదీ మఽద్యాహ్నం 3.30 గంటలకు పుష్కరఘాట్‌ నుంచి భారీ బైక్‌ ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతిస్వామి వారి ఉపదేశభాషణం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ ఆవిష్కరించారు. కర్రి శ్రీనివాస్‌, ఏ.వెంకటరమణ, శంకర భాగవతుల, సత్య, ప్రదీప్‌యాదవ్‌, చిరంజీవిరావు, దినేష్‌, వైష్ణవ్‌ పాల్గొన్నారు.

Read more