రాజమహేంద్రవరం రూరల్‌ 70.74%

ABN , First Publish Date - 2022-06-07T07:08:14+05:30 IST

పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు.

రాజమహేంద్రవరం రూరల్‌ 70.74%

  •  పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల
  • ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన ఉత్తీర్ణతా శాతం
  • ఫలితాల్లో బాలికలదే పైచేయి

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 6: పదో తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 3,052 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,159 మంది ఉత్తీర్ణత సాధించారని, దీంతో 70.74 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఇన్‌చార్జి ఎంఈవో దిలీప్‌కుమార్‌ తెలిపారు. ఈఏఆర్‌ ఎయిడెడ్‌ పాఠశాలకు చెందిన పీ ధనుష్‌ 563 మార్కులతో ప్రథమస్థానం, ధవళేశ్వరం జడ్పీ హైస్కూల్‌కు చెందిన భాగ్యం 559 మార్కులతో ద్వితీయ స్థానం, హుకుంపేట జడ్పీ హైస్కూల్‌కు చెందిన సి.భద్రకుమార్‌ 556 మార్కులతో తృతీయ స్థానం సాధించినట్టు ఎంఈవో తెలిపారు. 

Read more