రాజమహేంద్రవరంలో కలపాలి

ABN , First Publish Date - 2022-02-19T06:40:40+05:30 IST

మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో కలపాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారం నాలుగోరోజుకు చేరాయి.

రాజమహేంద్రవరంలో కలపాలి

మండపేట, ఫిబ్రవరి 18: మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో కలపాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు శుక్రవారం నాలుగోరోజుకు చేరాయి.  రిలేనిరాహారదీక్షలను జేఏసీ నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైసీపీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, ఏఐసీసీ సభ్యుడు కామన ప్రభాకరరావు, బీజేపీ నేత కోనసత్యనారాయణ, ఐక్యవేదిక నాయకులు శుక్రవారం ప్రారంభించారు. దీక్షశిబిరాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దీక్షల్లో పట్టణ శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు పెంకే గంగాధరం, మారేడుబాక సర్పంచ్‌ మట్టపర్తి గోవిందరాజు, మండపేట సహకార సంఘ అధ్యక్షుడు కుక్కల రామారావు, మాజీ కౌన్సిలర్‌ బండి గోవిందు, పెంకే వెంకట్రావు పాల్గొన్నారు. వైసీపీ నేత రెడ్డిరాధాకృష్ణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దూళి జయరాజు, ఉండ్రాజవరపు అర్జున్‌, బీసీ ఐక్యవేదిక నాయకులు గణపతి, సీఐటీయూ కార్యదర్శి కె.కృష్ణవేణి పాల్గొన్నారు.Read more