ఆశలపై నీళ్లు

ABN , First Publish Date - 2022-11-25T02:00:02+05:30 IST

ఈసారి పంట బాగుందన్న ఉత్సాహంతో ఖరీఫ్‌ మాసూళ్లకు దిగిన రైతులకు ప్రకృతి అనుకోనివిధంగా దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చి ఆరబెట్టుకుంటున్న తరుణంలో గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి తడిచిముద్దయింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. హడావుడిగా ధాన్యానికి బరకాలు కప్పినా అప్పటికే కొంత తడిచిపోయింది.

ఆశలపై నీళ్లు
మండపేటలో వర్షానికి తడిసిపోయిన ధాన్యం బస్తాలు.. (పక్కన) గొల్లపుంత రోడ్డులో తడిసిన రాశులు

  • జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఆరబెట్టుకున్న ధాన్యం వర్షార్పణం

  • తడిచి ముద్దయిన ధాన్యం చూసి రైతు కంట కన్నీళ్లు నిబంధనలు సడలించాలని వినతి

ఈసారి పంట బాగుందన్న ఉత్సాహంతో ఖరీఫ్‌ మాసూళ్లకు దిగిన రైతులకు ప్రకృతి అనుకోనివిధంగా దెబ్బతీసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చి ఆరబెట్టుకుంటున్న తరుణంలో గురువారం మధ్యాహ్నం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి తడిచిముద్దయింది. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. హడావుడిగా ధాన్యానికి బరకాలు కప్పినా అప్పటికే కొంత తడిచిపోయింది. తడిచిన ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బంది పెడతారన్న ఆందోళన రైతుల్లో మొదలైంది.

మండపేట, నవంబరు 24: అన్నదాతలంతా భయపడినట్టే అయ్యింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి మండపేట పరిసరాల్లోని ధాన్యం తడిచిపోయింది. ముందుజాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆకస్మికంగా కురిసిన వర్షానికి కొందరు రైతులు దొరికేశారు. దీంతో వారి పంట తడిచిపోయింది. ఉదయం వాతావరణం బాగుందని రైతులు తమ ధాన్యాన్ని కళ్లాల్లో ఆరబెట్టుకున్నారు. ఆకస్మికంగా వచ్చిన వర్షంతో ఒబ్బిడి చేసుకునే సమయం కూడా చిక్కలేదు. ఇప్పుడు తడిసిన ధాన్యం చూసి రైతులు కన్నీరుము న్నీరవుతున్నారు. ఇప్పటికే పెరిగిన పెట్టుబడులతోపాటు ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రైతులు ఆందోళనలో ఉన్నారు. దీనికితోడు ఆకస్మిక వర్షాలతో మరింత నష్టం జరిగింది. గురువారం మధ్యాహ్నం నాటి వర్షానికి మండపేట బైపాస్‌రోడ్డు, మారేడు బాక రోడ్డు, గొల్లపుంత రోడ్డులలో ఆరబెట్టుకున్న రైతుల ధాన్యం తడిసిముద్దయింది. అలాగే మండపేట మండలం ఏడిద, కేశ వరం, వై.సీతానగరం, తాపేశ్వరం, ఆర్తమూరు, ద్వారపూడి, జెడ్‌. మేడపాడు, మారేడుబాక, ఇప్పనపాడు తదితర గ్రామాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యం రంగుమారే ప్రమాదం కూడా ఉందని రైతులు అంటున్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులకు కొంతమేర నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి ఉంటే ఈపాటికే తామంతా గట్టెక్కేవాళ్లమని వాపోతున్నారు.

రావులపాలెంలో భారీ వర్షం

రావులపాలెం రూరల్‌, నవంబరు 24 : రావులపాలెం మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురి సింది. ఎడతెరిపిలేకుండా రెండు గంటలపాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ధాన్యం రాశు లు తడిసి ముద్దయ్యాయి. కోత దశకు చేరుకున్న పంట పొలాలు నేలకొరిగాయి. మాసూళ్లు పనిలో నిమగ్నమైన రైతులకు ఈ ఆకస్మిక వర్షం తీవ్ర నష్టాన్ని కలిగించింది.

Updated Date - 2022-11-25T02:00:02+05:30 IST

Read more