ఎడతెరిపిలేని వర్షం... రోడ్లు జలమయం

ABN , First Publish Date - 2022-09-10T06:39:02+05:30 IST

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

ఎడతెరిపిలేని వర్షం... రోడ్లు జలమయం

ముమ్మిడివరం, సెప్టెంబరు9: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంటకాల్వలు, మురుగునీటి కాల్వలు పొంగి ప్రవహిస్తున్నా యి. తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణ, టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ రోడ్డు, పాత పోస్టాఫీసు రోడ్డు, బాలయోగి కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ వర్షంనీటితో మునిగాయి. తహశీల్దార్‌ కార్యాలయం, సబ్‌ట్రెజరీ కార్యాలయంలోకి వర్షంనీరు చేరడంతో సిబ్బంది విధులు నిర్వహించడానికి ఇబ్బంది పడ్డారు.మండలంలో 84.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, రోడ్లపై ఎక్కడినీరు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు  ఇబ్బందులు పడ్డారు.Read more