పిఠాపురంలో కుంగిపోయిన ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి

ABN , First Publish Date - 2022-09-28T07:09:44+05:30 IST

పిఠాపురం పట్టణంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయి పాక్షికంగా కూలిపోయింది. పట్టణంలో ఉప్పాడ రైల్వేగేటు వద్ద ఏలేరు కాలువపై గల బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. కొంతకాలంగా శిథిలమవుతూ వచ్చిన బ్రిడ్జి మంగళవారం సాయంత్రం కుంగిపోయి ఒకవైపు పాక్షికంగా కూలిపోయింది.

పిఠాపురంలో కుంగిపోయిన ఆర్‌అండ్‌బీ బ్రిడ్జి

  • పాక్షికంగా కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం

పిఠాపురం, సెప్టెంబరు 27: పిఠాపురం పట్టణంలోని ప్రధాన ఆర్‌అండ్‌బీ రహదారిపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయి పాక్షికంగా కూలిపోయింది. పట్టణంలో ఉప్పాడ రైల్వేగేటు వద్ద ఏలేరు కాలువపై గల బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. కొంతకాలంగా శిథిలమవుతూ వచ్చిన బ్రిడ్జి మంగళవారం సాయంత్రం కుంగిపోయి ఒకవైపు పాక్షికంగా కూలిపోయింది. దీంతో ఆ భాగం మీదుగా రాకపోకలు జరగకుండా రాళ్లు ఏర్పాటు చేశారు. ఒకవైపు నుంచే రాకపోకలు సాగుతుండడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బ్రిడ్జికి మరమ్మతులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మొత్తం బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే పిఠాపురం-ఉప్పాడ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదముంది.

Read more