క్వారీ ప్రాంతంలో సంయుక్త కమిటీ పర్యటన

ABN , First Publish Date - 2022-12-10T00:57:10+05:30 IST

ఎస్‌.పైడిపాల, మల్లంపేట, మూలగపూడి ప్రాంతంలో రెవెన్యూ, మైన్స్‌ జిల్లా విజిలెన్స్‌ బృందం పర్యటించింది.

క్వారీ ప్రాంతంలో  సంయుక్త కమిటీ పర్యటన

రౌతులపూడి, డిసెంబరు 9: ఎస్‌.పైడిపాల, మల్లంపేట, మూలగపూడి ప్రాంతంలో రెవెన్యూ, మైన్స్‌ జిల్లా విజిలెన్స్‌ బృందం పర్యటించింది. అనుమతిలేని క్వారీ బ్లాస్టింగ్‌ చేసిన సంఘటనలో గిరిజన జంట మృతి చెందిన సంగతి నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్‌ కృతికా శుక్లా, ఆర్డీవో సీతారామయ్య ఆదేశాల మేరకు సంయుక్త కమిటీ సభ్యులు తహశీల్దార్‌ ఎల్‌.శివకుమార్‌, సీఐ సన్యాసిరావు, మైన్స్‌జిల్లా విజిలెన్స్‌ బృందం పర్యటించారు. ప్రమాదం జరిగిన క్వారీతో పాటు మిగిలిన క్వారీలను పరిశీలించారు. అనుమతి ఉన్నవి, అనుమతిలేనివి గుర్తింపుతోపాటు బ్లాస్టింగ్‌ చేసే విధానాన్ని పరిశీలించి ఉన్నాతాధికారులకు నివేదిక పంపనున్నట్టు తెలిపారు.

ముగ్గురిపై కేసు

అనుమతిలేని క్వారీలో బ్లాస్టింగ్‌చేసిన వారిని గుర్తించినట్టు తునిరూరల్‌ సీఐ సన్యాసిరా వు తెలిపారు. క్వారీ నిర్వాహుకుడు జిగిరెడ్డి సత్తిబాబు, బ్లాస్టింగ్‌చేసిన ప్రసాద్‌, బ్లాస్టింగ్‌ సరఫరా చేసిన రెడ్డి అనే వ్యక్తిపై 304 పోర్టు2 సెక్షన్‌కింద కేసునమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - 2022-12-10T00:57:22+05:30 IST