ఇన్‌చార్జిని ఇవ్వండి!

ABN , First Publish Date - 2022-11-12T01:32:20+05:30 IST

జిల్లాలో ఇటీవల చంద్రబాబు అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు ఇన్‌చా ర్జులను సమాయత్తం చేసేలా ఆదేశాలిచ్చారు. పార్టీ బలాబలాలపై లోతుగా చర్చించి, ఎక్కడా విభేదాలు లేకుండా నిరంతరం జనంలోనే ఉండేలా పోరాడాలని దిశానిర్దేశం చేశారు.

ఇన్‌చార్జిని ఇవ్వండి!
సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణారెడ్డి, పక్కన రాధాకృష్ణ, చిక్కాల

  • కాకినాడ రూరల్‌ నియోజకవర్గంపై తొలిరోజు ముగిసిన సమీక్ష

  • సమన్వయ కమిటీ సమావేశానికి పిల్లి సత్తిబాబు డుమ్మా

  • మిగిలిన ఆశావహులంతా హాజరైనా ఆయన మాత్రం గైర్హాజరు

  • నేతల ఎదుట ఇన్‌చార్జిని నియమించాలంటూ కేడర్‌ ముక్తకంఠం

  • కరప మండల నేతలతో నల్లమిల్లి, రాధాకృష్ణ, చిక్కాల ముఖాముఖి

  • ఇన్‌చార్జి నియామకాన్ని అధినేత చంద్రబాబు ప్రకటిస్తారని హామీ

  • ఇన్‌చార్జిని వేసే వరకు ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే అభ్యర్థే : నల్లమిల్లి

కాకినాడ రూరల్‌ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. మూడున్నరేళ్లుగా ఇన్‌చార్జి లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు రూరల్‌లో పెద్దగా జరగడం లేదు. అటు టిక్కెట్‌ ఆశిస్తున్న నేతల్లో ఐక్యత లేక ఎవరికివారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లా మొత్తం మీద ఒక్క కాకినాడ రూరల్‌ నియోజకవర్గమే టీడీపీకి తల నొప్పిగా మారింది. ఈనేపథ్యంలో దీన్ని సరిదిద్ది పార్టీని బలోపేతం చేసే దిశగా ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. అధినేత చంద్రబాబు అదేశాలతో అనపర్తి, తణుకు మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి, రాధాకృష్ణ శుక్రవారం జిల్లా పార్టీ కార్యాల యంలో కసరత్తు ప్రారంభించారు. విభేదాలు సరిదిద్ది ఇన్‌చార్జి లేని లోటు లేకుండా పార్టీని బలంగా ముందుకు నడపడం ఎలా అనేదానిపై నాయకులు, కేడర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఆశా వహులంతా ఈ సమావేశానికి హాజరైనా పిల్లి సత్తిబాబు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/ కాకినాడ సిటీ, నవంబరు 11: జిల్లాలో ఇటీవల చంద్రబాబు అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో ముఖాముఖి సమీక్ష నిర్వహించారు. రాబోయే ఎన్నికలకు ఇన్‌చా ర్జులను సమాయత్తం చేసేలా ఆదేశాలిచ్చారు. పార్టీ బలాబలాలపై లోతుగా చర్చించి, ఎక్కడా విభేదాలు లేకుండా నిరంతరం జనంలోనే ఉండేలా పోరాడాలని దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లాలోని ఏడింటికిగాను ఆరుచోట్ల సమీక్షలు అధినేత పూర్తిచేశారు. కాకినాడ రూరల్‌ నియోజ కవర్గానికి ఇన్‌చార్జి లేకపోవడంతో సమీక్ష వాయిదా వేశారు. అయితే రూరల్‌ నియోజకవర్గంలో సీటు ఆశిస్తున్న ఆశావహుల్లో కొందరు కొద్దిరోజుల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. అయితే 2019 ఎన్నికల్లో తన భార్య అనంతలక్ష్మి ఓటమి తర్వాత పిల్లి సత్తిబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో ఇన్‌చార్జి లేని పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల సత్తిబాబు తిరిగి అధినేతను కలిశారు. టిక్కెట్‌ హామీ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేయాలని అధినేత సూచిం చారు. అయితే సత్తిబాబు మళ్లీ రంగంలోకి రావడంతో అప్పటివరకు పార్టీ కార్యక్రమాలు చురు గ్గా చేపట్టిన ఆశావహ నేతలు పూర్తిగా కాడి ఎత్తేశారు. అసలు తమలో ఎవరికి ఇన్‌చార్జి పదవి వరిస్తుందో అని స్పష్టత లేక ఎవరికివారు పార్టీ కార్యక్రమాల జోలికి వెళ్లడం తగ్గించేశారు. దీంతో అధినేత చంద్రబాబు గత వారం రూరల్‌ నియోజకవర్గం పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల దగ్గర నుంచి, పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు, ఓటరు జాబితా పరిశీలన, సభ్యత్వాల నమోదు ఏదీ జరగడం లేదు. దీంతో తక్షణం పరిస్థితిని చక్కది ద్దాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని చంద్రబాబు ఆదేశించారు. దీంతో తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఎమ్మెల్సీ చిక్కాలతో కలసి శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో తొలుత ఆశావహులు, కీలక కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. దీనికి టిక్కెట్‌ ఆశిస్తున్న పెంకే శ్రీనివాసబాబా, పేరాబత్తుల రాజశేఖర్‌, వాసిరెడ్డి ఏసుదాసు తదితరులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే భర్త పిల్లి సత్తిబాబు హాజరు కావలసి ఉన్నా డుమ్మా కొట్టారు. దీనిపై రామకృష్ణారెడ్డి సమావేశం మధ్యలో ఆరా తీస్తే కొద్దిసేపట్లో సమావేశానికి వస్తున్నట్టు సమాచారం అందింది. కానీ సత్తిబాబు మాత్రం గైర్హాజరయ్యారు. మిగిలిన ఆశావహులతో కూర్చోవడానికి సత్తిబాబు అనాసక్తి ప్రదర్శిస్తున్నారా? లేదా ఇతరత్రా కారణాలేమున్నాయనే దానిపై ఆరా తీసి పరిశీలకులు అధిష్ఠానం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కాగా సమ న్వయకమిటీ సమావేశం, ఆతర్వాత కరప మండలం పార్టీ ముఖ్యనేతలతో నిర్వ హించిన సమీక్షలో అంతా కలిపి రూరల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జిని నియమిం చాలని డిమాండ్‌ చేశారు. ఎవరికి సీటు ఇస్తారనేది స్పష్టం చేయాలని కోరారు. ఇన్‌చార్జి లేక పార్టీ కార్యక్రమాల నిర్వహణ, దిశానిర్దేశం లేక కేడర్‌ కూడా అయో మయంలో ఉన్నారని ముక్తకంఠంతో వినిపించారు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని ఇన్‌చార్జిని ఎవరిని నియమించాలనేది అధినేత త్వరలో నిర్ణయి స్తారని పేర్కొన్నారు. సమస్యలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కొక్కదానికి ఇన్‌చార్జిని నియమిస్తున్నారని, రూరల్‌కు కూడా ఆ కబురు వస్తుందన్నారు. ఈలోపు చంద్ర బాబును సీఎం చేయాలనే లక్ష్యంలో ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి అంతా కలసి పనిచేయాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబే కరెక్ట్‌ అని, ఆ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఇర వై వేల మంది ఓటర్లకు ఒక క్లస్టర్‌ ఇన్‌చార్జిని నియమించాల్సి ఉండడంతో అందరి అభిప్రాయాలు తీసుకుని శని, ఆదివారాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు నల్ల మిల్లి వివరించారు. కాకినాడ నగరానికి సంబంధించి ఎనిమిది డివిజన్లు కాకినాడ రూరల్‌లో ఉన్నందున శనివారం పార్టీ కార్యక్రమాలు, ఓటర్ల పరిశీలన తదిత ర అంశాలపై చర్చించనున్నారు. ఇప్ప టికే ఆశావహులు లోకేశ్‌, అచ్చెన్నా యుడుని కలిసినట్టు సమాచారం.

Updated Date - 2022-11-12T01:32:20+05:30 IST

Read more