‘సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం’
ABN , First Publish Date - 2022-12-31T22:42:26+05:30 IST
అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐఎఫ్‌టీయూ కొవ్వూరు కన్వీనర్ మంగతాయారు విమర్శించారు.

కొవ్వూరు, డిసెంబరు 31: అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐఎఫ్‌టీయూ కొవ్వూరు కన్వీనర్ మంగతాయారు విమర్శించారు. ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో శనివారం కొవ్వూరు ఐసీడీ ఎస్ సీడీపీవోకు వినతిపత్రం అందజేశారు. యూనియన్ నాయకురాలు మల్లిక మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు అందించాలని, ఆర్టీసీ మాదిరిగా అంగన్వాడీలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు.
Read more