నేడు రమణ మహర్షి జయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-12-30T00:56:08+05:30 IST

మండలంలోని రాచపల్లి గ్రామంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న భగవాన్‌ రమణమహర్షి 143వ జయంతి మహోత్సవాలు శుక్రవారం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆశ్రమ పీఠాధిపతులు, స్వామిజీలు, మాతాజీలు, ఆధ్యాత్మికవేత్తలు తరలిరానున్నారు. శుక్రవారం అరుణాచలేశ్వర స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తారు. ఆశ్రమానికి చెందిన రమానంద స్వామి జీ ఆధ్వర్యంలో గోర్స దుర్గాప్రసాద్‌ ప్రారంభించే ఆధ్యాత్మిక సభలో ముఖ్య అతిథులుగా హైదరా

నేడు రమణ మహర్షి జయంతి ఉత్సవాలు

ప్రత్తిపాడు, డిసెంబరు 29: మండలంలోని రాచపల్లి గ్రామంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న భగవాన్‌ రమణమహర్షి 143వ జయంతి మహోత్సవాలు శుక్రవారం నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆశ్రమ పీఠాధిపతులు, స్వామిజీలు, మాతాజీలు, ఆధ్యాత్మికవేత్తలు తరలిరానున్నారు. శుక్రవారం అరుణాచలేశ్వర స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహిస్తారు. ఆశ్రమానికి చెందిన రమానంద స్వామి జీ ఆధ్వర్యంలో గోర్స దుర్గాప్రసాద్‌ ప్రారంభించే ఆధ్యాత్మిక సభలో ముఖ్య అతిథులుగా హైదరాబాద్‌, కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువులు కాంషీజి. నిహారికి, కేవీ రెడ్డిలతో పాటు ఆశ్రమ పీఠాధిపతులు, మాతాజీలు, స్వామిజీలు, లక్ష్మానంద, వినమ్రనంద సర్వసతి, ప్రభావతి, ఉద్యానందగిరి, నెర్విశేషానంద గిరి తదితరులు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆశ్రమంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేపట్టారు.

Updated Date - 2022-12-30T00:56:08+05:30 IST

Read more