112 అకౌంట్లు.. రూ.72.95 లక్షలు

ABN , First Publish Date - 2022-09-19T06:14:55+05:30 IST

కొవ్వూరు మండలం ధర్మవరం పోస్టాఫీస్‌లో అవకతవకలపై మూడవరోజు విచారణ కొనసాగింది.

112 అకౌంట్లు.. రూ.72.95 లక్షలు
ఖాతాదారుల వివరాలు నమోదు చేసుకుంటున్న పోస్టల్‌ సిబ్బంది

ధర్మవరం పోస్టాఫీస్‌లో కొనసాగుతున్న విచారణ

మూడో రోజు తేలిన లెక్క ఇది.. పోస్టుమాస్టర్‌ సస్పెన్షన్‌


కొవ్వూరు, సెప్టెంబరు 18 : కొవ్వూరు మండలం ధర్మవరం పోస్టాఫీస్‌లో అవకతవకలపై మూడవరోజు విచారణ కొనసాగింది. తాడేపల్లిగూడెం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ సి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో  ఆదివారం ఖాతాదారుల వివరాలను సేకరించారు. ఖాతాదారుల నుంచి స్టేట్‌మెంట్లు సేకరించారు. ఇప్పటి వరకు 112 మంది ఖాతాదారులకు నకిలీ పాస్‌ పుస్తకాలు అందించి రూ.72.95 లక్షలు స్వాహా చేసినట్టు గుర్తించారు. తాడేపల్లిగూడెం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ సి.వి.రామిరెడ్డి మాట్లాడుతూ  తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం సబ్‌ పోస్టాఫీస్‌ పరిధిలో ధర్మవరం పోస్టాఫీస్‌ బ్రాంచి ఉంది. ఈ పోస్టాఫీస్‌లో కొత్త ఖాతాదారులకు పాస్‌ పుస్తకం ఇచ్చే అధికారం లేదు. కొత్త ఖాతా ప్రారంభిస్తే ఖాతాదారుడికి ఎస్‌బీ 26 రశీదు అందించాలి. అనంతరం ఖాతాదారుడికి సం బంధించిన నగదు అకౌంట్‌లో చెల్లించి వేగేశ్వరపురం పోస్టాఫీస్‌కు పంపించాలి. వేగేశ్వరపు రం పోస్టుమాస్టర్‌ పరిశీలించి పాస్‌ పుస్తకం మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆ పాస్‌ పుస్తకం ఖాతాదారు డికి ఇచ్చి రశీదును వెనక్కి తీసుకోవాలన్నారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. పోస్టాఫీస్‌లో అధికారికంగా అందించే పాస్‌ పుస్తకంలో  10 అంకెల అకౌం ట్‌ నెంబరును ఇవ్వడం జరుగుతుంది. నకిలీ అకౌంట్లకు సం బంధించి పిన్‌కోడ్‌ నెంబరుకు మరో 5 అంకెల నెంబరు జోడించి ఖాతాదారులకు అంద జేశారు.నకిలీ పాస్‌ పుస్తకాలు అందించి పెద్ద మొత్తంలో కాజే సిన పోస్టుమాస్టర్‌ ఎస్‌.కె మీరావల్లీని సస్పెన్షన్‌ చేశామన్నారు. అంతే కాకుండా శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలతో పాటు, పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఖాతాదారులను, పోస్టుమాస్టర్‌ నుంచి స్టేట్‌మెంట్లు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అంద జేస్తామన్నారు.మూడో రోజు కూడా పోస్టుమాస్టర్‌ను గ్రామస్థులు నిర్బంధం లోనే ఉంచారు. విచా రణలో ఏఎస్పీలు ఏవీఎన్‌ నరసింహరావు,కె.శ్రీనివాసరావు,ఇన్‌స్పెక్టర్లు డి.శ్రీకా ంత్‌, ఎం.ముత్యాలరావు, ఐదుగురు మెయిల్‌ ఓవర్‌ సియర్‌లు ఖాతాదారులను విచారించారు.ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి ధర్మవరం గ్రామస్థులు తాడే పల్లిగూడెం వెళ్లి హోం మంత్రి వనితను న్యాయం చేయాలని వేడుకున్నారు. 


వడ్డీ లెక్కకడతానని పాస్‌ పుస్తకాలు తీసుకున్నాడు..


గత మూడేళ్ల కిందట పోస్టాఫీస్‌లో రూ.5 లక్షలు డిపాజిట్‌ చేశా. మూడే ళ్లకు డిపాజిట్‌ చేయడంతో 2022 అక్టోబరు 20వ తేదీకి కాల పరిమితి పూర్తవుతుందని 10 రోజుల కిందట వడ్డీ లెక్క కడతానని పోస్టుమాస్టర్‌ మీరావల్లీ పాస్‌ పుస్తకం తీసుకున్నాడు. పాస్‌ పుస్తకం లేకపోవడంతో ఎవరూ సమాధానం చెప్పడం లేదు.నా పరిస్థి తి అర్ధంకావడం లేదు.. డబ్బులు రాకపోతే చావే గతి.. 

- మరపట్ల సుజాత, ఽధర్మవరం

Read more