పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేస్తారా..!

ABN , First Publish Date - 2022-09-08T06:27:58+05:30 IST

పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్‌లను మూసివేసి వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని తుని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు ఆరోపించారు.

పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసేస్తారా..!

 తుని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కృష్ణుడు

తుని, సెప్టెంబరు 7: పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్‌లను మూసివేసి వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని తుని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు ఆరోపించారు. తుని పట్టణంలో స్థానిక కొత్తపేట ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పేదవాడి ఆకలి తీర్చేందుకు ఒక్కరోజు అన్నదానం కార్యక్రమం బు ధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు రూ.5కు అన్నం పెట్టాలన్న ఉద్దేశ ంతో గత ప్రభుత్వంలో చంద్రబాబు అన్నా క్యాంటీన్‌లను ప్రారంభించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంట నే అన్నా క్యాంటీన్‌లను నిర్వీర్యం చేశారన్నారు. పేదలను ఇబ్బంది పెట్టే వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, అందుకు అరాచాకాలు చేస్తున్నారన్నారు. అనంతరం పేదలకు భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, కార్యదర్శి మళ్ళ గణేష్‌, సీనియర్‌ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, తెలుగుయువత జిల్లా అధ్యక్షు డు యనమల శివరామకృష్ణన్‌, జగన్మోహన్‌ పాల్గొన్నారు.

ఒక రోజు అన్నా క్యాంటీన్‌ ప్రారంభం

కిర్లంపూడి: ఒక రోజు అన్నా క్యాంటిన్‌ను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ కిర్లంపూడిలో ప్రారంభించారు. టీడీపీ మండల అధ్యక్షుడు చదరం చంటిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిర్లంపూడి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం ఎదుట ఈ ఒక్కరోజు అన్నాక్యాంటిన్‌ను ఆయన  ప్రారంభించి పేదలకు అన్నదానం చేశారు. గత ప్రభుత్వం లో రూ.5కే అన్నా క్యాంటిన్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చి దా నిని నిలిపి వేసిందన్నారు. టీడీపీ నాయకులు అన్నా క్యాంటిన్‌ను నిర్వహిస్తే వైసీపీ దాడులు చేపట్టడం చాలా దారుణమన్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టే ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉంటే. పేదల పొట్టకొట్టడమే వైసీపీ ప్రభు త్వం పనిగా పెట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జగపతినగరం గ్రామ సర్పంచ్‌ మహేంధ్రాడ శ్రీలత, గుడాల రాంబబు, భూపాలపట్నం సర్పంచ్‌ వీరంరెడ్డి కాశీబాబు, ఎస్‌విఎస్‌ అప్పలరాజు, జంపన సీతారామచంద్రవర్మ, ఎంపీటీసీ కాళ్ల దొంగబాబు, సాదే కుమారి, తూము  కుమార్‌,కుర్ల చినబాబు,  పలువురు టీడీపీ నా యకులు ఈ అన్నా క్యాంటిన్‌లో పాల్గొన్నారు. 


Read more