మూసేసింది!!

ABN , First Publish Date - 2022-07-18T06:49:36+05:30 IST

కాల్వలకు నీరున్నా సక్రమంగా పారుదలలేదు. శివారు ప్రాంతాలకు సాగునీరు, కాల్వ వెంబడి గ్రామాల ప్రజలకు తాగునీరు అందించలేని దుస్థితి. తూటికాడ, గుర్రపుడెక్కల వంటి అవరోధాలను తొలగిం చే పనులకు సైతం ఆమోదముద్ర పడకపోవడంతో ఈ ఏడాది వేసవి సీజన్‌లో పనులు నిలిచిపోయాయి.

మూసేసింది!!
సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం కాలువలో పేరుకుపోయిన గుర్రపుడెక్క

  • కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క
  • నీటి ప్రవాహానికి అవరోధంగా తూటికాడ
  • శిథిలావస్థకు చేరిన 48 స్లూయిజ్‌లు
  • సార్వాకు నీటి విడుదలపై రైతుల్లో ఆందోళన
  • పనుల కోసం రూ.30కోట్లతో ప్రతిపాదనలు
  • అనుమతులు రాక మూడేళ్లుగా ఇదే నిర్లక్ష్యం
  • సాగునీటి సంఘాలు లేకే ఈ దుస్థితి

సామర్లకోట, జూలై 17: కాల్వలకు నీరున్నా సక్రమంగా పారుదలలేదు. శివారు ప్రాంతాలకు సాగునీరు, కాల్వ వెంబడి గ్రామాల ప్రజలకు తాగునీరు అందించలేని దుస్థితి. తూటికాడ, గుర్రపుడెక్కల వంటి అవరోధాలను తొలగిం చే పనులకు సైతం ఆమోదముద్ర పడకపోవడంతో ఈ ఏడాది వేసవి సీజన్‌లో పనులు నిలిచిపోయాయి. దీనివల్ల నీటి ప్రవాహానికి అవరోధాలు రానున్న సీజ న్‌కు కూడా కొనసాగుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధుల సాక్షిగా ఈ ఏడాది ప్రారంభమవుతున్న ఖరీఫ్‌ సీజన్‌కు రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు. ఈ ఏడాది కాల్వలు, డ్రైనేజీల్లో పూడికతీత, కాల్వగట్లు పటిష్టం వంటి పనులకు ఇక చేతులెత్తేసినట్లే.

తూర్పుడెల్టా కాలువ పరిధిలో...

ధవళేశ్వరంనుంచి మాధవపట్నం జమునానగర్‌ వరకూ తూర్పుడెల్టా కాలు వ పరిధిలో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధాన కాలువ కు అనుసంధానంగా ఉన్న పలు బ్రాంచి కాలువలకు, వాటికి అనుబంధంగా ఉన్న పిల్లకాలువలకు ఈ ఏడాది కనీస మరమ్మతులు చేయకపోవడంతో ఖరీ ఫ్‌ సీజన్‌కు ఎంతమేర సాగునీరు అందుతుందో అని ప్రశ్నార్థకంగా మారింది. ఈ కాలువల వెంబడి ఉన్న 48 స్లూయిజ్‌లు పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు సాక్షాత్తూ ఇరిగేషన్‌ ఉన్నతాధికారుల నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇవి మూ డేళ్లుగా మరమ్మతులకు నోచుకోలేకపోవడంతో వాటి షట్టర్లు మూస్తే తెరుచు కోకుండా.. తెరుచుకుంటే మూసుకోనివిధంగా మూలన పడి ఉన్నాయి. దీంతో ఈ స్లూయిజ్‌ల దిగువన ఉన్న పొలాలకు సాగునీరు అతివృష్టి, అనావృష్టి అన్న ట్టుగా తయారైంది. సామర్లకోట మండలం వేట్లపాలెంనుంచి అచ్యుతాపురత్ర యం మీదుగా సముద్రంలో కలిసే ప్రధాన డ్రైన్‌, సామర్లకోట నుంచి అచ్యుతా పురత్రయం వరకూ వెళ్లే వెస్ట్‌ ఏలేరు డ్రైన్‌ల్లో 12ఏళ్లుగా ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. 2020లో కురిసిన భారీవర్షాలకు డ్రైన్లు పొంగి పొర్లి రోజుల తరబడి పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయి వరిపంట పూర్తిగా దెబ్బతింది. డ్రైన్లలో పూడికతీత పనులు సకాలంలో చేపట్టి ఉంటే ఇంతగా రైతు లు నష్టపోయి ఉండేవారు కాదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని డ్రైనే జీ పనులకు కనీస మరమ్మతులు చేయాలని తూర్పుడెల్టా రైతులు కోరుతు న్నారు. ఈ కాలువల కింద బ్రాంచి కాలువలు, పిల్ల కాలువల గట్లు బలహీనం గా తయారయ్యాయి. వేసవిలో ఈ గట్లను బలోపేతం చేస్తే ఖరీఫ్‌ సీజన్‌లో వ ర్షాకాలంలో రైతులకు కొంతమేర ఇబ్బందులు తొలగిపోయేవి. అయినా అధికా రులు వీటిపై దృష్టి సారించలేదు. 2023 జనవరి వరకూ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓఅండ్‌ఎం) పనులకోసం రూ.30కోట్లతో పనులకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఈ పనులకు ప్రభుత్వంనుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

సాగునీటి సంఘాలేవీ?

పంట కాలువలు, డ్రైనేజీ ల్లోని తూటికాడ, గుర్రపు డె క్కను చంపేందుకు రసాయ నాలు పిచికారీ చేస్తారు. ఈ పనులకు సంబంధించి ప్రభు త్వంనుంచి ఆమోదముద్ర కూడా ప్రభుత్వంనుంచి రాలే దు. ఏటా మాదిరిగానే కాలు వలకు నీటిని విడుదల చేసే సమయంలో రసాయనాలు పిచికారీ చేసినట్లుగా కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉండే సాగు నీటి సంఘాలు ఉండేవి. నీటి తీరువా ద్వారా వసూలైన నగదుతోపాటు తూర్పుడెల్టా కాలువ ఆధునికీకరణ పనులు చేసే వారు. సాగునీటి సలహా మండలి సమావేశాలు నిర్వహించి ఏయే ప్రాంతాల్లో కాలువ పనులు చేయా లో నిర్ణయించేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ మూడేళ్లలో సాగునీటి సం ఘాల ఉనికి లేకుండా పోయింది. దీంతో సాగునీటి పారుదలశాఖ అధికారులు నిర్ణయించిన పనులే చేపట్టలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ సమయంలో ఎలా..

జిల్లాలోని సామర్లకోట, పెద్దాపురం, కాకినాడ పట్టణాల ప్రజలతోపాటు 80 గ్రామాల దాహార్తి తీర్చేందుకు తాగునీటి చెరువులను నింపేందుకు ప్రధాన కాలువలకు ప్రస్తుతం నీటిని వదలనున్నారు. ఈ మూడు పట్టణాల ప్రజల దాహార్తి సమస్య తీర్చే సామర్లకోటలోని రెండు జలాశయాలు ఒక్కొక్కటీ 300, 500 ఎకరాల విస్తీర్ణాల్లో ఉన్నాయి. కాలువల్లో ఏర్పడిన అవరోధాలవల్ల ఆ రెం డు జలాశయాలకు తాగునీరు మళ్లే అవకాశాలు లేకపోయాయని మున్సిపల్‌ అధికారులు వాపోతున్నారు. ప్రధాన కాలువల్లో నీరు ప్రవహిస్తుంటే తూటికా డ, గుర్రపుడెక్క నిర్మూలనకు రసాయనాల పిచికారీ చేసినా ఫలితం ఉండదు.

పొలాలకు సాగునీరు వెళ్లేదెలా..?

పిఠాపురం/గొల్లప్రోలు, జూలై 17: సార్వా సాగు ప్రారంభమైనా పంటపొలాలకు సాగునీరు చేరే దారి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలే రు, పీబీసీ కాలువల్లో పలుచోట్ల గుర్రపుడెక్క, పూడిక పేరుకుపోయింది. కాలువల కు నీటి విడుదలకు ముందే పూడికను తొలగించాల్సి ఉండగా ఇప్పటివరకూ తొలగించలేదు. గుర్రపుడెక్క పేరుకుపోవడంతో సాగునీటి సరఫరాకు ఆటంకాలు ఏర్ప డుతున్నాయి. వర్షాల ఆధారంగా నారుమడులు వేస్తున్నారు. నాట్లు వేసేందుకు తప్పనిసరిగా కాలువల ద్వారా సాగునీరు సరఫరా కావాలి. పరిస్థితులు అందుకు అ నుకూలంగా లేకపోవడం, గుర్రపుడెక్క తొలగించేందుకు ఇరిగేషన్‌ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షట్టర్లు, కళింగల్‌, స్లూయిజ్‌లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో సార్వాసాగుకు పూర్తిస్థా యిలో నీటి సరఫరా అనుమానమేనని రైతులు చెబుతున్నారు. గుర్రపుడెక్క, పూడిక తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Read more