ఉచిత పథకాల పేరుతో వైసీపీ భారీ అవినీతి

ABN , First Publish Date - 2022-06-11T05:35:56+05:30 IST

పిఠాపురం, జూన్‌ 10: రాష్ట్రంలో ఉచిత పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌చార్జీలు, పన్నుల బాదుడు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇతరత్రా దోపీడీల ద్వారా ప్రజల నుంచి నెలకు రూ.35వేలు లాక్కొంటున్నారన్నా

ఉచిత పథకాల పేరుతో వైసీపీ భారీ అవినీతి

పిఠాపురం, జూన్‌ 10: రాష్ట్రంలో ఉచిత పథకాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్యుత్‌చార్జీలు, పన్నుల బాదుడు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఇతరత్రా దోపీడీల ద్వారా ప్రజల నుంచి నెలకు రూ.35వేలు లాక్కొంటున్నారన్నారు. వైసీపీ గడపగడపకు ప్రభు త్వం బూటకమని విమర్శించారు. క్షణంలో సమస్యలు పరిష్కరిస్తామని వెళ్తున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాగులాపల్లి, చిత్రాడల్లో ఏయే సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాం డ్‌ చేశారు. గడపగడపకు వెళ్తుంటే ప్రజలు నిలదీస్తున్నారని అందుకే సెల్‌ సిగ్నల్స్‌ పనిచేయకుండా జామర్‌లు పెడుతున్నారన్నారు. మొబైల్‌లో వీడియోలు తీస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. నాగులాపల్లి నెంబరు 1స్కూలు స్థలాన్ని వైసీపీ నేత లే కబ్జా చేశారని, మీ సర్పంచ్‌ మా నాయకుడు ఎవ్వరిని వదలడం లేదని అంటున్నారని వివరించారు. 

Updated Date - 2022-06-11T05:35:56+05:30 IST