ముంపు సమస్యను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-09-11T06:21:29+05:30 IST

పిఠాపురం, సెప్టెంబరు 10: అధిక వర్షాలతో ముంపు బెడదను ఎదుర్కొంటున్న శివారు ప్రాం తాల ముంపు సమస్యను పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన పట్టణంలోని యానాదుల కా

ముంపు సమస్యను పరిష్కరించాలి
యానాదుల కాలనీలో పర్యటిస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

పిఠాపురం, సెప్టెంబరు 10: అధిక వర్షాలతో ముంపు బెడదను ఎదుర్కొంటున్న శివారు ప్రాం తాల ముంపు సమస్యను పరిష్కరించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన పట్టణంలోని యానాదుల కాలనీలో ఆయన శనివారం పర్యటించారు. వర్షాలకు నీరు ఇళ్లలోకి చేరి ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నీరు బ యటకు పోయే విధంగా మెయిన్‌ డ్రెయిన్‌ ఏర్పా టు చేయాలని సూచించారు. తాము అధికారంలో ఉండగానే ముంపు నివారణ చేపట్టాలని భావించామని, ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ఓడిపోవడం తో పనులు చేపట్టలేకపోయామని వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి మన్సి పాలిటీలో రూ.15కోట్లు మిగులు నిధులు అందుబాటులో ఉన్నాయని, వీటితో డ్రెయిన్‌ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పట్టణాధ్యక్షుడు రెడ్డెం భాస్కరరావు, కాదా రాజు, అరుణకుమారి, పూడి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Read more