ప్రజలకు రక్షణేది: బండారు

ABN , First Publish Date - 2022-03-16T06:45:58+05:30 IST

వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.

ప్రజలకు రక్షణేది: బండారు

రావులపాలెం రూరల్‌, మార్చి 15: వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. వెదిరేశ్వరంలో మంగళవారం నిర్వహించిన గౌరవసభలో బండారు, అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌, అమలాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, టీడీపీ తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న పాలనతో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పేదప్రజలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంద డం లేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


Read more