పుర హితం కోరేవాడే పురోహితుడు

ABN , First Publish Date - 2022-09-11T06:40:27+05:30 IST

పురహితం కోరేవాడే పురోహితుడని.. శాస్త్ర విహితంగా యజమానులతో క్రతు వులను చేయించాలని మహామహోపాధ్యాయ డాక్టర్‌ చిర్రా వూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు.

పుర హితం కోరేవాడే పురోహితుడు

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 10: పురహితం కోరేవాడే పురోహితుడని.. శాస్త్ర విహితంగా యజమానులతో క్రతు వులను చేయించాలని మహామహోపాధ్యాయ డాక్టర్‌ చిర్రా వూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు. సత్కర్మాచరణకు పురోహితులే ప్రేరణ చేయాలన్నారు. ఆపస్తంభ పురోహిత పరిషత్‌ ద్వావిం శతి(22వ) వార్షికోత్సవ సభ శనివారం శ్రీయేడిది సత్యనారా యణ కళామందిరంలో డాక్టర్‌ శ్రీరామశర్మ అధ్యక్షతన నిర్వ హించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనచేసి జగద్గురువు ఆదిశంక రాచార్యులకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆపస్తంబ పురోహిత పరిషత్‌ను ఏర్పాటుచేసిన తోపెల్ల సుబ్రహ్మణ్యసీ తారామం చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీరామశర్మ అధ్య క్షోపన్యాసం చేస్తూ కరోనా సమయంలో స్థాలీపాక హోమ పద్ధ తిలో హోమాలు నిర్వహించడం ద్వారా కొన్నివేల కిలోమీటర్ల పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించడం జరిగిం దని వివరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోటప్పకొండ శ్రీవేంకటేశ్వర వేదవిజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ మార్తి వేంకట్రామశర్మ మాట్లాడుతూ ఎన్ని వేదాలు, శాస్ర్తాలు చది వినా సంస్కారం లేకపోతే అటువంటి వ్యక్తులుచేసే కర్మలకు ఫలితం ఉండదని వివరించారు. యమలజన కాంతి, ఏకన క్షత్రశాంతి తదితర శాంతులు నిర్వహించడం ద్వారా గృహ స్తులు సుభిక్షంగా ఉంటారన్నారు. ఆపస్తంబ పురోహిత పరి షత్‌ ఆధ్వర్యంలో కూచిమంచి అగ్రహారంలో ఉన్న శంకరమ ఠంలో ఆదిశంకరులకు అభిషేకం, పూజలు, పంచోపనిషత్తుల పారాయణ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విధ్వ త్సభలో స్మార్త పురోహితులు పైడిమర్రి వేంకట సత్యసూర్యసు బ్రహ్మణ్య అవధాని, కర్రా వినాయకశర్మ, వడ్లమాని సుబ్ర హ్మణ్య ఘనాపాఠి, కర్రా సంతోష్‌శర్మలు పలు వివరాలు వెల్ల డించారు. స్మార్తాపర విద్యా పరీక్షలను నిర్వహించారు. గరి మెళ్ల విశ్వనాథం, రాళ్లపల్లి సూర్యసుబ్రహ్మణ్యశర్మలు పరీక్షాధికారులుగా వ్యవహరించారు. ఏపీధార్మక పరిషత్‌ సభ్యులుగా నియమితులైన డాక్టర్‌ చిర్రావూరి శ్రీరామశర్మను సత్కరిం చారు. ఆపస్తంబ పురోహిత పరిషత్‌ అధ్యక్షుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కార్యదర్శి తోపెల్ల కార్తికేయశర్మ పాల్గొన్నారు.  Read more