-
-
Home » Andhra Pradesh » East Godavari » peddapuram mla chinarappa tdp-NGTS-AndhraPradesh
-
వైసీపీపై విసుగు చెందుతున్న ప్రజలు
ABN , First Publish Date - 2022-09-13T06:47:48+05:30 IST
పెద్దాపురం, సెప్టెంబరు 12: వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని దివిలి గ్రామంలో ఆయన సోమవారం పర్యటించారు. గ్రామంలో బూత్ లెవెల్ ఓటర్ వెరిఫికేషన్, కన్వీనర్లు, కోకన్వీనర్‌లతో కలసి ఓట్ల జా

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం, సెప్టెంబరు 12: వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని దివిలి గ్రామంలో ఆయన సోమవారం పర్యటించారు. గ్రామంలో బూత్ లెవెల్ ఓటర్ వెరిఫికేషన్, కన్వీనర్లు, కోకన్వీనర్‌లతో కలసి ఓట్ల జాబితాలను త్వరతిగతిన పూర్తి చేయాలన్నారు. అనంతరం కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వైసీపీ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ప్రజల బాధలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), మొయిళ్ల కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబురాజు, తుమ్మల నాని, రేలంగి బుజ్జి తదితరులున్నారు.