వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , First Publish Date - 2022-12-30T00:56:50+05:30 IST

రాష్ట్రంలో మూడేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి శూన్యం కావడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. గురువారం పట్టణంలో 12,13వార్డుల్లోని బలుసులపేట, ఇందిరాకాలనీ, పేరంటాలు పుంత రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడు

వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

సామర్లకోట, డిసెంబరు 29: రాష్ట్రంలో మూడేళ్ల వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి శూన్యం కావడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. గురువారం పట్టణంలో 12,13వార్డుల్లోని బలుసులపేట, ఇందిరాకాలనీ, పేరంటాలు పుంత రోడ్డు ప్రాంతాల్లో టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి రాజప్ప హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో సమస్యలు పోవాలంటే టీడీపీ పాలన రావాలని, వచ్చే ఎన్నికల్లో చం ద్రబాబును సీఎం చేయాలని కోరారు. నేతలు కంటే బాబు, యార్లగడ్డ చిన్నీ, బలుసు శ్రీనివాస్‌, జయలక్ష్మి, బొందల రామలక్ష్మి, గుడాల శంకర్‌, సైఫుల్లా, గొలితి సత్యనారాయణ, మెండెం సర్రయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:56:50+05:30 IST

Read more