-
-
Home » Andhra Pradesh » East Godavari » peddapuram maridamma temple parking mafia-NGTS-AndhraPradesh
-
పార్కింగ్ మాఫియాకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2022-07-18T05:55:13+05:30 IST
పెద్దాపురం, జూలై 17: మరిడమ్మ దేవస్థానం వద్ద పార్కింగ్ మాఫియా ఆగడాలకు మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర అడ్డుకట్ట వేశారు. ఆశీలపాటదారుడికి వార్నింగ్ ఇచ్చారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెచ్చిపోతున్న పార్కింగ్ మాఫియా పే

పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
పెద్దాపురం, జూలై 17: మరిడమ్మ దేవస్థానం వద్ద పార్కింగ్ మాఫియా ఆగడాలకు మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర అడ్డుకట్ట వేశారు. ఆశీలపాటదారుడికి వార్నింగ్ ఇచ్చారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెచ్చిపోతున్న పార్కింగ్ మాఫియా పేరుతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దేవస్థానం పరిసరాల్లో పార్కింగ్ చేసుకున్న వాహనాలకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన పనిలేదంటూహెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీంతో ఆలయానికి వచ్చే పలువురు భక్తులు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
జాతరకు భక్తుల రద్దీ
మరిడమ్మ జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైసీపీ నాయకులు కర్రి వెంకటరమణ, గోలి దొరబాబు, వీరంరెడ్డి శ్రీనివాస్ భక్తులకు ప్రసాదాలను వితరణ చేశారు. జాతరకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాట్లను డీసీ విజయరాజు పర్యవేక్షించారు.