పట్టాల కోసం రైతుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-31T06:34:16+05:30 IST

గోకవరం మండలంలోని గంగంపాలెం గ్రామంలో సీలింగ్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం గోకవరంలో అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా, ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహించారు.

పట్టాల కోసం రైతుల ధర్నా

గోకవరం, ఆగస్టు 30: గోకవరం మండలంలోని గంగంపాలెం గ్రామంలో సీలింగ్‌ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం గోకవరంలో అఖిలభారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా, ప్రదర్శన  వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా రైతు కూలీ సంఘం నాయకులు, సభ్యులు గ్రామ పంచాయితీ కార్యాలయం నుంచి రెవున్యూ కార్యాలయం వరకు ప్రధాన రహదారిపై ప్రదర్శన చేపట్టారు. అనంతరం రెవున్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గంగంపాలెం గ్రామంలో గత 30 సంవత్సరాలుగా 16ఎకరాల సీలింగ్‌ భూమిని భూమిలేని నిరుపేదలు  సాగు చేసుకుంటు న్నారన్నారు. 2000లో సంబంధింత సీలింగ్‌ భూమి సాగు చేసుకుంటున్న 38 మంది దళితులు, ఆదివాసీ కుటుంబాలకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. కొంతమంది భూ స్వాములు ఆభూమిలోకి దౌర్జన్యంగా చొరబడి స్వాధీనం చేసు కున్నారని ఆరోపించారు. ఇటీవల ఇక్కడ నుంచి బదిలీ అయిన తహశీల్ధారు పోసి బాబు, వీఆర్వో చెల్లాయ మ్మ సంబంధింత రికార్డులను తారుమారు చేశారని విమర్శించారు. ఉన్నతధికా రులు స్పందించి రికార్డులను తారుమారు చేసిన తహ శీల్ధారు, వీఆర్వోలపై చర్యలు తీసుకోవడంతోపాటు, సీలింగ్‌ భూమికి పట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆభూమి స్వాధీనం అయ్యేలా తగుచర్యలు తీసుకోవాలని ఆందోళన కారులు డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండులతోకూడిన వినతిపత్రాన్ని రైతు కూలీ సంఘం సభ్యులు రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు ఎం.దుర్గాప్రసాద్‌, వెంకట నాయుడు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.



Updated Date - 2022-08-31T06:34:16+05:30 IST