కార్తీకంలో లక్ష దాటిన సత్యదేవుడి వ్రతాలు

ABN , First Publish Date - 2022-11-19T01:25:21+05:30 IST

రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసం సందర్భంగా విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారి వ్రతాలను ఆచరించారు.

కార్తీకంలో లక్ష దాటిన సత్యదేవుడి వ్రతాలు

అన్నవరం, నవంబరు 18: రత్నగిరివాసుడైన సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసం సందర్భంగా విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారి వ్రతాలను ఆచరించారు. ఈ ఏడాది కార్తీకమాసంలో శుక్రవారం నాటికి భక్తులు ఆచరించిన వ్రతాల సంఖ్య లక్ష మార్కును దాటింది. గురువారం నాటికి 99, 237 వ్రతాలు జరగగా, శుక్రవారం మరో 5 వేల వ్రతాలు జరిగినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో 1,04,230 వ్రతాలకు ఈ సంఖ్య చేరింది. కార్తీకమాసం ముగియడానికి మరో 5 రోజులు మిగిలిఉండగా, మరో 40 వేల వ్రతాలు జరుగుతాయని అధికారుల అంచనా. కాగా శనివారం నుంచి సోమవారం వరకు రత్నగిరికి భక్తుల తాకిడి అధికంగా ఉండనుంది. ఈ మూడు రోజులు సుమారు 30 వేల వ్రతాలు జరుగుతాయి. సత్రం గదులు రత్నగిరిపై లభించడం కష్టతరంగా మారింది. దీంతో భక్తులు ప్రైవేటు లాడ్జిలను ఆశ్రయిస్తుండడంతో వారు డిమాండును సొమ్ము చేసుకుంటున్నారు.

Updated Date - 2022-11-19T01:25:21+05:30 IST

Read more