రూ.1.02లక్షలు పలికిన గణపతి లడ్డూ

ABN , First Publish Date - 2022-09-13T06:31:29+05:30 IST

ముక్కామల బీసీ కాలనీలో శ్రీలక్ష్మి లక్ష్మిగణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డూకు పాట నిర్వహించారు. వాసంశెట్టి సంజీవ్‌, మోహన్‌, వాసంశెట్టి బ్రదర్స్‌ రూ.1,02,016కు లడ్డూను దక్కించుకున్నారు.

రూ.1.02లక్షలు పలికిన గణపతి లడ్డూ

అంబాజీపేట, సెప్టెంబరు 12: ముక్కామల బీసీ కాలనీలో శ్రీలక్ష్మి లక్ష్మిగణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డూకు పాట నిర్వహించారు. వాసంశెట్టి సంజీవ్‌, మోహన్‌, వాసంశెట్టి బ్రదర్స్‌ రూ.1,02,016కు లడ్డూను దక్కించుకున్నారు. మండలంలోని పలు గణపతి నవరాత్రి పందిళ్ల వద్ద భారీ అన్నసమారాధనలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్లను పురవీధుల్లో ఊరేగించి నిమజ్ఞనం చేశారు. Read more