రూ.1.07 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

ABN , First Publish Date - 2022-08-31T06:53:22+05:30 IST

రూ.500, రూ. 200 నకిలీ నోట్లను మారుస్తూ కొద్దిపాటి వస్తువు లు కొంటూ వారి నుంచి వచ్చే అసలు నోట్లతో జీవనం సాగించే విధానాన్ని ప్రారంభించిన ప్రకా శం జిల్లా మాటూరు మండలం తాలేటిపాలేనికి చెందిన పులిపాటి ఆనందరావును మంగళవారం అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ కొండలరావు తెలి పారు.

రూ.1.07 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

అమలాపురం టౌన్‌, ఆగస్టు 30: రూ.500, రూ. 200 నకిలీ నోట్లను మారుస్తూ కొద్దిపాటి వస్తువు లు కొంటూ వారి నుంచి వచ్చే అసలు నోట్లతో జీవనం సాగించే విధానాన్ని ప్రారంభించిన ప్రకా శం జిల్లా మాటూరు మండలం తాలేటిపాలేనికి చెందిన పులిపాటి ఆనందరావును మంగళవారం అరెస్టు చేసినట్టు పట్టణ సీఐ కొండలరావు తెలి పారు. అతని వద్ద నుంచి రూ.1.07 లక్షల నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గతం లో నిధి నిక్షేపాల అన్వేషణ పేరుతో లక్షల్లో నష్ట పోయిన ఆనందరావు నకిలీ నోట్లను మార్చడం మొదలుపెట్టాడని వివరించారు. 



Read more