వృద్ధుడు అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-08-17T06:29:13+05:30 IST

అమలాపురం గోఖలే సెంటర్‌ సమీపంలోని మాణిక్యాంబ వీధిలో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న కంకటాల సత్యారావు(75) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

వృద్ధుడు అనుమానాస్పద మృతి

అమలాపురం టౌన్‌, ఆగస్టు 16: అమలాపురం గోఖలే సెంటర్‌ సమీపంలోని మాణిక్యాంబ వీధిలో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న కంకటాల సత్యారావు(75)  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుం డడంతో స్థానికులు మంగళవారం పోలీసులకు సమాచారమందించారు. పట్టణ సీఐ కొండలరావు, పట్టణ ఎస్‌ఐ శ్రీనివాస్‌ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంట్లోని సామగ్రి కొద్దిగా చెదురుమదురుగా పడి ఉన్నాయి. మృతుడు సత్యారావు భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సత్యారావు మూడు, నాలుగు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లి దుర్వాసన వస్తోంది. క్లూస్‌ టీమును రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్టు పట్టణ సీఐ కొండలరావు తెలిపారు. మృతుని సోదరుడు వెంకటరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. Read more