అధికారుల డుమ్మాపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-07T06:55:56+05:30 IST

మండపేట ప్రభుత్వాసుపత్రి అడ్వయిజరీ కమిటీ సమావేశం సోమవారం ఆసుపత్రి అడ్వయిజరి కమిటీ చైర్మన్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.

అధికారుల డుమ్మాపై ఎమ్మెల్యే ఆగ్రహం

మండపేట, జూన్‌ 6: మండపేట ప్రభుత్వాసుపత్రి అడ్వయిజరీ కమిటీ సమావేశం సోమవారం ఆసుపత్రి  అడ్వయిజరి కమిటీ చైర్మన్‌ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. మున్సిపల్‌ కమిషనర్‌, మండల అభివృద్ధి అధికారులు  హాజరుకాలేదు. హాజరుకాని అధికారులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. నలుగురు వైద్యులు పనిచేస్తున్నారని, నాలుగు వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైద్యులు డాక్టర్‌ నిర్మలాచారి కమిటీకి వివరించారు. అలాగే సిబ్బంది కొరత ఉందన్నారు. సమావేశంలో  డాక్టర్‌ అస్మా, కమిటీ సభ్యులు యారమాటి వెంకట్రాజు, డాక్టర్‌ అస్మాఅక్బర్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Read more