పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌తో కలిసి పనిచేద్దాం : వీసీ

ABN , First Publish Date - 2022-07-07T06:17:54+05:30 IST

రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌తో కలిసి పనిచేద్దామని ఆదికవి నన్నయ వర్శిటీ ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌తో కలిసి పనిచేద్దాం : వీసీ

దివాన్‌చెరువు, జూలై 6 : రాష్ట్ర  పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌తో కలిసి పనిచేద్దామని ఆదికవి నన్నయ వర్శిటీ ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. ఏపీ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌, ఎండీ ఎన్‌.సంజయ్‌ నన్నయ వీసీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కార్పొరేషన్‌లో చేస్తున్న పనులను వివరించారు. నన్నయ వర్సిటీలో నిర్మాణ పనులు కార్పొ రేషన్‌ ద్వారా నిర్వహించాలనే ప్రతిపాదన తెలిపారు.దీనిపై వీసీ సానుకూలంగా స్పందించి త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందామని చెప్పారు. ఎండీ సంజయ్‌ను వీసీ సన్మానించి జ్ఞాపిక అందజేశారు.  


Read more