కర్బలా అమరవీరులకు నివాళులర్పిస్తూ పాదయాత్ర

ABN , First Publish Date - 2022-09-11T06:42:04+05:30 IST

ముస్లింల ఆరాధ్య దైవం కర్బలా పుణ్య భూమిలో అశువులు బాసిన ఇమామ్‌హుస్సేన్‌తో పాటు అతని 72మంది పరివారానికి ముస్లింలు నివాళులర్పించారు.

కర్బలా అమరవీరులకు నివాళులర్పిస్తూ పాదయాత్ర

మామిడికుదురు, సెప్టెంబరు 10: ముస్లింల ఆరాధ్య దైవం కర్బలా పుణ్య భూమిలో అశువులు బాసిన ఇమామ్‌హుస్సేన్‌తో పాటు అతని 72మంది పరివారానికి ముస్లింలు నివాళులర్పించారు. నగరంలోని పెదపంజీష నుంచి పాశర్లపూడిలోని బీబీఫాతిమాజెహరా దర్గా వరకు హుస్సేన్‌ జిందాబాద్‌ అనే నినాదంతో  పాదయాత్రను నిండుశోకంతో నిర్వహించారు. అందార్‌అబ్బాస్‌, నూరైన్‌అబ్బాస్‌, కాశింమహ్మద్‌రజా ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు  పాల్గొన్నారు. జాతీయ పతాకాలతో పాటు ఇమామ్‌హుస్సేన్‌ జెండాలను ప్రదర్శిస్తూ పాదయాత్ర నిర్వహించారు. దారిపొడవునా పలు భక్త బృందాలు పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు ప్రసాద వితరణ చేశాయి. కార్యక్రమంలో అబేద్‌ అలీ, సజ్జాద్‌ హుస్సేన్‌, ఇలియాజ్‌హుస్సేన్‌, కిష్వర్‌అబ్బాస్‌, రజాఅబ్బాస్‌ పాల్గొన్నారు. 
Read more