హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-12-30T00:13:20+05:30 IST

హత్యాయత్నం కేసులో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లికి చెందిన దుప్పలపూడి సత్యనారాయణను అదే గ్రామానికి చెందిన ముమ్మిడి రాజబాబు, అతని డ్రైవర్‌ కోన వీరబాబు, తడాల వీరబాబు 2012 నవంబరులో గునపంతో పొడిచి, రాడ్లతో మోకాళ్లపై కొట్టడంతో కాళ్లు విరిగిపోయాయి.

 హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలు

కాకినాడ రూరల్‌, డిసెంబరు 29: హత్యాయత్నం కేసులో ముగ్గురికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించారు. కాకినాడ రూరల్‌ మండలం గంగనాపల్లికి చెందిన దుప్పలపూడి సత్యనారాయణను అదే గ్రామానికి చెందిన ముమ్మిడి రాజబాబు, అతని డ్రైవర్‌ కోన వీరబాబు, తడాల వీరబాబు 2012 నవంబరులో గునపంతో పొడిచి, రాడ్లతో మోకాళ్లపై కొట్టడంతో కాళ్లు విరిగిపోయాయి. దీంతో సత్యనారాయణను జీజీహెచ్‌కు తరలించారు. దేవుడి భూమి వివాదం పరిష్కారం నిమిత్తం కొంత భూమి పేదలకిచ్చి మరికొంత భూమిని దేవుడికి ఉంచుదామని సత్యనారాయణ చెప్పాడు. దీంతో రాజబాబు మరో ఇద్దరు వ్యక్తులు సత్యనారాయణపై దాడి చేశారు. ఇంద్రపాలెం పోలీసులు నమోదుచేసిన సెక్షన్‌ 307 కేసులో నేరం ఋజువుకాకపోవడంతో కేసును అప్పట్లో కొట్టివేసారు. అయితే సత్యనారాయణ, రాజబాబు మరో ఇద్దరిపై కాకినాడ ప్రిన్సిపల్‌ సెషన్‌కోర్టులో న్యాయవాది ద్వారా ప్రైవేట్‌ కేసు వేశారు. ఈ కేసులో ముగ్గురిపైనా నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికీ 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.5000 జరిమానా విధిస్తూ కాకినాడ ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు గురువారం తీర్పునిచ్చారు.

Updated Date - 2022-12-30T00:13:20+05:30 IST

Read more