పన్నులు చెల్లించకపోతే కఠినచర్యలు : అదనపు కమిషనర్‌

ABN , First Publish Date - 2022-03-16T05:51:44+05:30 IST

ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను తక్షణమే చెల్లించకపోతే కఠినచర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు స్పష్టం చేశా రు.

పన్నులు చెల్లించకపోతే కఠినచర్యలు : అదనపు కమిషనర్‌

 26 దుకాణాలకు జప్తు నోటీసులు 

 179 కుళాయి కనెక్షన్‌లు తొలగింపు 

కార్పొరేషన్‌(కాకినాడ), మార్చి 15: ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను తక్షణమే చెల్లించకపోతే కఠినచర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు స్పష్టం చేశా రు. పన్నుల వసూళ్లపై సోమవారం సాయంత్రం రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌వోలు, ఆర్‌ఐలు, అడ్మిన్‌లు బిల్లు కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్‌ మాట్లాడుతూ 2021-22కి సంబంధించి ఈనెల 31వ తేదీతో గడువు ముగుస్తున్నందున పన్ను బకాయిదారులు వెంటనే పన్నులు చెల్లించాలని కో రారు. ముఖ్యంగా మొండి బకాయిలపై కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.  పన్ను లు చెల్లించని 179 మంది బకాయిదారులకు సంబంధించి కుళాయి కనెక్షన్లు తొలగించామన్నారు. 26 దుకాణాలను సీజ్‌ చేశామన్నారు. బకాయిలకు సం బంఽఽధించి 2573 మందికి రెడ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. 1939 మందికి కొత్త కనెక్షన్లు తొలగించినట్లు తెలిపారు. 26 మంది బకాయిదారులకు జప్తు నోటీసులు ఇచ్చామని చెప్పారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. 
Read more