అమ్మా.. మా గురించి వెతకవద్దు

ABN , First Publish Date - 2022-05-30T06:03:55+05:30 IST

అమ్మా మా గురించి వెతకవద్దు.. అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాం..ఇంత కాలం ఏదోలా తీరుద్దామని చూశాం కానీ మా వల్ల కావడంలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇదీ కుటుంబంతో సహ బయటకు వెళ్లిన కుమార్తె తన తల్లికి పెట్టిన మెసేజ్‌.. దీంతో కంగారుపడిన తల్లి పోలీసులను ఆశ్రయించింది.

అమ్మా.. మా గురించి వెతకవద్దు

కొవ్వూరు, మే 29: అమ్మా మా గురించి వెతకవద్దు.. అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నాం..ఇంత కాలం ఏదోలా తీరుద్దామని చూశాం కానీ మా వల్ల కావడంలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఇదీ కుటుంబంతో సహ బయటకు వెళ్లిన కుమార్తె తన తల్లికి పెట్టిన మెసేజ్‌.. దీంతో కంగారుపడిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ ఎస్‌ఐ బి.దుర్గాప్రసాద్‌ తెలిపారు.పట్టణంలోని ఐదో వార్డుకి చెందిన దాసరి రత్నకుమారి తన కుమార్తె పూర్ణిమ సౌజన్య, అల్లుడు మన్నే చంద్రశేఖర్‌, మనుమడు రాజ్‌వీర్‌ కార్తీక్‌ కనిపించడం లేదని పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అల్లుడు చంద్రశేఖర్‌ కొవ్వూరు బజాజ్‌ షోరూమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.ఈ నెల 25వ తేదీన ఉదయం 11-30 గంటలకు తన కుమార్తె, అల్లుడు, మనుమడు కలిసి రాజమహేంద్రవరం వెళ్లారని, మధ్యాహ్నం 3-30 గంటలకు కుమార్తె పూర్ణిమ సౌజన్య ఫోన్‌కు అప్పుల బాధలు ఎక్కువ య్యాయని.. తమ గురించి వెతకవద్దని మెసేజ్‌ పెట్టింది. ఆ మెసేజ్‌ చూసిన వెంటనే ఫోన్‌ చేయగా పనిచేయలేదని పేర్కొంది. చుట్టుపక్కలు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ కానరాలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు  కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Read more