‘మోదీ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యం’

ABN , First Publish Date - 2022-08-15T06:40:07+05:30 IST

దేశంలో మోదీ అరాచక పాలనను అంత మొందించడమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తోందని రైతు సంఘం జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య పేర్కొన్నారు.

‘మోదీ అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యం’

అమలాపురం రూరల్‌, ఆగస్టు 14: దేశంలో మోదీ అరాచక పాలనను అంత మొందించడమే లక్ష్యంగా సీపీఐ పనిచేస్తోందని రైతు సంఘం జాతీయ కార్యదర్శి రావుల వెంకయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పద్దెనిమిది ప్రజాస్వామ్య పార్టీలతో ప్రత్యేక కూటమి ఏర్పాటుచేసి పయనిస్తున్నామన్నారు.  అక్టోబరు 14న విజయవాడలో లక్షలాది మందితో మహాప్రదర్శన ఏర్పాటు చేశామని ప్రకటించారు. సీపీఐ జిల్లా మహాసభ ముగింపు సభ ఆదివారం ఈదరపల్లిలోని అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. జగన్‌ లాంటి దుర్మార్గుల పాలనను అంతమొందించాలని పిలు పునిచ్చారు. బి.రవి అధ్యక్షతన జరిగిన మహాసభలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, చెల్లుబోయిన కేశవశెట్టి, చెలికాని స్టాలిన్‌, రమణి, వాసంశెట్టి సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.Read more