అధికారుల అత్యుత్సాహంతో ఉపాధ్యాయుడి బలి: ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2022-11-30T00:30:02+05:30 IST

అధికారుల అత్యుత్సాహం వల్లే కరప జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు వి.వెంకటగంగాధర్‌ బలయ్యారని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ ఆరోపించారు. కరప హైస్కూల్‌లో మంగళవారం ఆయన యూటీఎఫ్‌ నాయకుల తో కలిసి ఉపాధ్యాయుడి సస్పెన్సన్‌కు గల కారణాలపై పాఠశాల హెచ్‌ఎం యు.లీలామనోహర్‌, ఇతర ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థిని కొట్టారనే అభి

అధికారుల అత్యుత్సాహంతో ఉపాధ్యాయుడి బలి: ఎమ్మెల్సీ

కరప, నవంబరు 29: అధికారుల అత్యుత్సాహం వల్లే కరప జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు వి.వెంకటగంగాధర్‌ బలయ్యారని ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ ఆరోపించారు. కరప హైస్కూల్‌లో మంగళవారం ఆయన యూటీఎఫ్‌ నాయకుల తో కలిసి ఉపాధ్యాయుడి సస్పెన్సన్‌కు గల కారణాలపై పాఠశాల హెచ్‌ఎం యు.లీలామనోహర్‌, ఇతర ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థిని కొట్టారనే అభియోగంపై ఉపాధ్యాయుడిని అన్యాయంగా సస్పెండ్‌ చేశారని వారు తెలిపారు. వారి తెలిపిన దాని ప్రకారం అధికారులు కనీస ఆలోచన లేకుండా ఒక ఉపాధ్యాయుడిని అన్యాయంగా సస్పెండ్‌ చేశారని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసి సస్పెన్సన్‌ ఎత్తివేసేలా చూస్తానని, అవసరమైతే కలెక్టర్‌ కార్యాలయం ఎదుట స్వయంగా తానే నిరసన చేపడతానని స్పష్టంచేశారు. యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రభాకర్‌వర్మ, జిల్లా ప్రధానకార్యదర్శి టి.చక్రవర్తి, మండల గౌరవాధ్యక్షుడు వడ్డి వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు టి.శ్రీరామ్‌, పి.రాజబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:30:02+05:30 IST

Read more