కాపు కాయని మిర్చి!

ABN , First Publish Date - 2022-09-21T06:52:09+05:30 IST

పంట ఎదిగినా సరిగా కాపు కాయక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాలతో నిండా మునిగిపోయామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాపు కాయని మిర్చి!
వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేస్తున్న రైతులు.. నాసిరకం మిరపకాయలను చూపుతున్న రైతు

గొల్లప్రోలు/గొల్లప్రోలు రూరల్‌, సెప్టెంబరు 20: పంట ఎదిగినా సరిగా కాపు కాయక మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాసిరకం విత్తనాలతో నిండా మునిగిపోయామని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గొల్లప్రోలు పట్టణంతోపాటు తాటిపర్తి, చేబ్రోలు, చెందుర్తి గ్రామాలకు చెందిన రైతులు గొల్లప్రోలులోని విత్తనాల దుకాణం వద్ద జేకే సీడ్స్‌కు చెందిన మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి పంట వేశారు. మూడు నెలలు గడిచినా కాపు సరిగా కాయలేదు. మొక్కలు ఎదిగినా నాసిరకంగా కాయలు కాయడం, కొన్ని మొక్కలకు కాపు లేకపోవడంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. విత్తనాలు నాసిరకం కావడం వల్లే ఈ విధంగా అయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎకరానికి రూ.50 వేలకు పైగా పెట్టుబడులు పెట్టామని, అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి వచ్చే అవకాశం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలపై డీలరును ప్రశ్నించినా ఫలితం లేకపోయిందని, కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. నాసిరకం మిర్చి విత్తనాలతో నష్టపోయిన తమకు పరిహారం అందించాలంటూ రైతులు పెంకే సత్యనారాయణ, రామిశెట్టి మం గయ్య, చక్రధరరావు, నాగేశ్వరరావు తదితరులు మండల వ్యవసాయాధికారి సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. సుమారు 400 ఎకరాల్లో ఈ రకం మిర్చి విత్తనాలు వేశామని, పెట్టిన పెట్టుబడి పూర్తిగా తిరిగి ఇప్పించి తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. Read more