4596 సంఘాలకు రూ.45.51 కోట్లు

ABN , First Publish Date - 2022-04-24T06:35:12+05:30 IST

మహిళల అభివృద్ధి, సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు

4596 సంఘాలకు రూ.45.51 కోట్లు
కొవ్వూరులో వలంటీర్లకు అవార్డులు అందజేస్తున్న హోంమంత్రి తానేటి వనిత

జిల్లాలో సున్నా వడ్డీ రాయితీ

కొవ్వూరులో అందజేసిన హోం మంత్రి వనిత

చాగల్లు, ఏప్రిల్‌ 23 : మహిళల అభివృద్ధి, సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు పట్టణం నందమూరు రోడ్‌లోని సుందర సాయి కల్యాణ మండపంలో శనివారం సున్నా వడ్డీ మూడో విడత పథకం చెక్కుల పంపిణీ, వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర అవార్డుల ప్రధానం చేసి మాట్లాడారు. జిల్లాలో 4,596 మహిళా సంఘాలకు రూ.45.51 కోట్లు సున్నా వడ్డీ రాయితీని అందజేశామన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 4,576 గ్రూపుల్లో ఉన్న మహిళలకు రూ. 6.68 కోట్లు సున్నావడ్డీ రాయితీని మహిళల బ్యాంకు ఖాతాల్లో జమచేశామన్నారు. అనంతరం కొవ్వూరు పట్టణంలో సేవావజ్ర 2, సేవారత్న 5, సేవామిత్ర 202 మందికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, వైస్‌చైర్మన్లు మన్నె పద్మ, గండ్రోతు అంజలీదేవి, బండి పట్టాభిరామారావు, ముదునూరి నాగరాజు పాల్గొన్నారు.

===============================


Updated Date - 2022-04-24T06:35:12+05:30 IST