యూటీఎఫ్‌ రాష్ట్ర సభలు విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-03-04T06:17:46+05:30 IST

అనంతపురంలో ఈనెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగే యూటీఎఫ్‌ రాష్ట్ర సభలను విజయవంతం చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షరీఫ్‌ కోరారు.

యూటీఎఫ్‌ రాష్ట్ర సభలు విజయవంతం చేయాలి

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 3: అనంతపురంలో ఈనెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగే యూటీఎఫ్‌ రాష్ట్ర సభలను విజయవంతం చేయాలని యూటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు షరీఫ్‌ కోరారు. ఈమేరకు గురువారం రాజమహేంద్రవరంలో జిల్లా కార్యదర్శి ఈవీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సందర్భగా షరీఫ్‌ మాట్లాడుతూ సదస్సు సందర్భంగా జరిగే జిల్లా జాతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొనాలని అన్నారు. యూటీఎఫ్‌ జిల్లా మహిళా అసోసియేట్‌ ఎం.విజయగౌరీ, జిల్లా కార్యదర్శి జేవీవీ సుబ్బారావు, రాజానగరం ప్రధాన కార్యదర్శి తాతారావు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రమేష్‌, రాష్ట్ర కౌన్సిలర్లు రాజేశ్వరి, చిలుకూరి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Read more