కొండెక్కిన కొత్తిమీర ధర

ABN , First Publish Date - 2022-09-17T06:29:57+05:30 IST

రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోటీగా కొత్తిమీర ధర కొండెక్కింది. మార్కెట్లో రూ.10కు లభించే కొత్తిమీర కట్ట రూ.50 వెచ్చిస్తేనేగానీ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. కిలో రూ.50 నుంచి రూ.80కు లభించే కొత్తిమీర ఏకంగా రైతు బజార్లలో కిలో రూ.240కు ధర పెరిగింది.

కొండెక్కిన కొత్తిమీర ధర
రైతు బజార్‌లో కొత్తిమీర

  • రైతు బజార్లో కిలో కొత్తిమీర రూ. 240

సర్పవరం జంక్షన్‌, సెప్టెంబరు 16: రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలతో పోటీగా కొత్తిమీర ధర కొండెక్కింది. మార్కెట్లో రూ.10కు లభించే కొత్తిమీర కట్ట రూ.50 వెచ్చిస్తేనేగానీ దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. కిలో రూ.50 నుంచి రూ.80కు లభించే కొత్తిమీర ఏకంగా రైతు బజార్లలో కిలో రూ.240కు ధర పెరిగింది. అదే బయట మార్కెట్లో దీని ధరకు నియంత్రణ లేకుండా పోయింది. మాంసాహారం, శాఖాహార వంటకాల్లో కొంచెం కొత్తిమీర వేయగానే గుమగుమలతో వంట రుచే మారిపోతుంది. మాంసాహార వంటకాల్లో కొత్తిమీర వేయకపోతే గొంతు దిగదు. వంటింట్లో కొత్తిమీర లేకపోతే గృహిణులకు ఇబ్బం దే. కానీ పెరిగిన ధరలతో కొత్తిమీరను కొనాలన్నా, వంటకాల్లో వేయాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వ స్తోందని మహిళలు తెలిపారు. గతనెల వరకు రూ.10 వెచ్చిస్తే పెద్ద కట్ట ఇచ్చేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని, రూ.50 వెచ్చిస్తే ఏదో నాలుగు కొమ్మలు కొత్తిమీర విక్రయిస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు కొత్తిమీర పంట దెబ్బతినడంతో దీని ధరలకు రెక్కలొచ్చినట్లు రైతులు తెలిపారు. స్థానికంగా సాగుచేసిన కొత్తిమీర వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరిపడా లేకపోవడంతో బయట ప్రాంతాల నుంచి కొత్తిమీరను తీసుకురావడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. కొత్తిమీర ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

మండుతున్న ఆకుకూరల ధరలు

సామర్లకోట, సెప్టెంబరు 16: మార్కెట్లో ఇతర ఆకుకూ రలు ధరలు కూడా మండిపోతున్నాయి. తోటకూర, గోంగూ ర, బచ్చలి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పాలకూర తది తర ఆకుకూరలు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కొత్తిమీర మాదిరిగానే ఇతర ఆకు కూరల ధరలూ విపరీతంగా పెరిగాయి. కరివేపాకు రూ.10కి వచ్చేది నేడు రూ.20కి పెరిగింది. తోటకూర కట్ట ఒక్కింటికి రూ.5 ఉండగా నేడు మూడు కట్టలు రూ.20 పలుకుతోంది. గోంగూర కూడా ఆదే రీతిలో పెరిగింది. ఇక పాలకూర, బచ్చలి, పుదీనా, పాలకూర, మెంతికూర ధరలు కూడా 50శాతం పెరిగాయి. ఇటీవల ఆరురోజులపాటు కురిసిన భారీవర్షాలకు ఆకు కూరల తోటలు నీటిముంపులో ఉండిపోవడంవల్ల కుళ్లిపో యాయని రైతులు చెబుతున్నారు. 


Read more